/rtv/media/media_files/2025/05/05/0ufqjtUZRWQnWwJ2rjEE.jpg)
Jammu jails on high alert, security tightened after intel on terror strike, Sources
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సరిహద్దుల్లో భారత సైన్యం మరింత మోహరించింది. అయితే జమ్మూకశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనేతలను విడిపించేదుకు భారీ కుట్రకు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలోనే శ్రీనగర్ సెంట్రల్ జైలు, కోట్ బాల్వాల్ జైలు, అలాగే జమ్మూలోని జైళ్లకు భారీగా భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి అనంతరం.. విచారణలో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి జైళ్లలో ఉంచారు.
Also Read: వీడు భర్త కాదు బండరాయి.. భార్య ముక్కు అందంగా ఉందని కొరుక్కు తినేశాడు వెధవ!
మరోవైపు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందుతులుగా ఉన్న నిస్సార్, ముష్తాక్ సహచరులను ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారిస్తోంది. ఈ క్రమంలోనే జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు అందింది. దీంతో జమ్ము కశ్మీర్‌లోని ఆయా జైళ్ల వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. CISF డీజీ శ్రీనగర్‌లోని ఉన్నతాధికారులతో ఈ అంశంపై ఇప్పటికే భేటీ అయినట్లు తెలుస్తోంది. 2023 నుంచి జమ్మూకశ్మీర్‌లో జైళ్ల భద్రత ఈ దళం అధినంలోనే ఉంటోంది.
ఇదిలాఉండగా ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా భారత ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. దీంతో కశ్మీర్ అడవులను జల్లెడ పడుతున్నాయి. నిఘా వర్గాల హెచ్చరికతో గాలింపు చర్యలు వేగవంతం చేసింది. అయితే దక్షిణ కశ్మీర్‌లోనే ఉగ్రవాదులు ఉన్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో కశ్మీర్ అడవులను ఇండియన్ ఆర్మీ చుట్టిముట్టింది. సురాన్‌కోట్ అడవుల్లో ఉగ్రవాద శిబిరాలు ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రదాడి కుట్రను కూడా భద్రతా బలగాలు భగ్నం చేశాయి. పూంచ్‌లో ఐఈడీ పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నాయి. 5 ఐఈడీలు, కమ్యూనికేషన్ పరికరాలను సీజ్ చేశారు.
Also Read: కీలక అప్‌డేట్.. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన మరో టెర్రరిస్ట్ అరెస్టు
అయితే భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి కాల్పులు జరిగాయి. నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఆర్మీ ఈ దాడులకు పాల్పడింది. పూంఛ్, రాజౌరీ, మెంధార్, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్, కుప్వారా, బారాముల్లా ప్రాంతాల్లో పాకిస్థాన్ ఈ దాడులు జరిగాయి. దీంతో వెంటనే స్పందించిన భారత భద్రతా బలగాలు పాకిస్థాన్ ఆర్మీ ప్లాన్‌ను తిప్పికొట్టాయి. దీంతో బార్డర్‌లో భారత సైన్యం మరింత మోహరించింది. కొత్తగా మరో 16 అదనపు బెటాలియన్లను రంగంలోకి దిగాయి.
telugu-news | rtv-news