Big Breaking: జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న ఎదురు కాల్పులు.. ఇద్దరు సైనికులు మృతి

జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాదులకు , భారత ఆర్మీకి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఇందులో ఇద్దరు జవాన్లు మృతి చెందగా..పది మంది గాయపడ్డారు. ఇందులో ఒక ఉగ్రవాది కూడా హతమయ్యాడు. 

New Update
encounter

J&K encounter

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాంలోని అఖల్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరుగుతున్న ఎన్ కౌంటర్ తొమ్మిదో రోజుకు చేరుకుంది. నిన్న రాత్రంతా ఆ ప్రాంతం పెద్ద పేలుళ్లు,  కాల్పుల శబ్దాలు ప్రతిధ్వనించింది. ఇందులో ఇద్దరు సైనికులు చనిపోగా..పదిమంది గాయపడ్డారు. అలాగే ఎదురు కాల్పుల్లో ఒక ఉగ్రవాది చనిపోయాడు. 

ఉగ్రవాదుల కోసం తొమ్మిది రోజులుగా వెతుకులాట.. 

జమ్మూ, కాశ్మీర్ లో ఉగ్రవాదులు దట్టమైన అడవులు, గుహలల్లాంటివి ఉపయోగిస్తున్నారని భారత ఆర్మీ చెబుతోంది. వీటిల్లో రహస్య స్థావరాలను ఏర్పరచుకున్నారని తెలిపింది. దీంతో ఈ ప్రాంతాలన్నింటినీ భారత ఆర్మీ అణువణువూ గాలిస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ గత కొన్ని దశాబ్దాలలో అత్యంత సుదీర్ఘమైన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌గా మారింది.

Also Read: Delhi Rains: ఢిల్లీని ముంచెత్తిన వాన..పలుచోట్ల మునిగిన రోడ్లు, ఆగిన విమానాలు

Advertisment
తాజా కథనాలు