Delhi Rains: ఢిల్లీని ముంచెత్తిన వాన..పలుచోట్ల మునిగిన రోడ్లు, ఆగిన విమానాలు

దేశ రాజధాని ఢిల్లీని వర్షాలు ముంచెత్తాయి. నిన్న రాత్రి నుంచి కుంభవృష్టి కురుస్తోంది. దీంతో చాలా రోడ్లు జలమయ్యాయి. 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

New Update
delhi rains

Delhi Rains

భారీగా కురుస్తున్న వర్షానికి ఢిల్లీ మొత్తం స్తంభించిపోయింది. నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది.  అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. పంచకుయన్ మార్గ్, మధుర రోడ్డు, భారత్ మండపం వెలుపల ఉన్న రోడ్డు, ఇతర ప్రాంతాలు జలమయం అయ్యాయి. నోయిడా, గురుగ్రామ్‌లో భారీ వర్షం కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

100కు పైగా విమానాలు ఆలస్యం..

మరోవైపు భారీగా కురుస్తున్న వర్షాల వలన ఢిల్లీ నుంచి విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. 100కు పైగా విమానాలు ఆలస్యమయ్యాయి.  ఇక ఈరోజు కూడా భారీగా వర్షం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. రెడ్ అలెర్ట్ జారీ చేసింది. దాదాపు  అన్ని విమానయాన సంస్థలు ప్రయాణీకులకు హెచ్చరికలు జారీ చేశాయి. విమానాశ్రయానికి బయలుదేరే ముందు వారి విమాన స్థితిని తనిఖీ చేయాలని కోరారు.  విమానాశ్రయానికి బయలుదేరే వెబ్‌సైట్ లేదా యాప్‌లో విమాన స్థితిని తెలుసుకోవాలని ఇండిగో వెల్లడించింది.

మరోవైపు శనివారం రక్షాబంధన్ కారణంగా ఢిల్లీ వాసులు బయటకు వస్తున్నారు. దీంతో రహదారులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

Also Read: Delhi: ఇండియన్లే భారతీయతను మర్చిపోతున్నారా..ఢిల్లీ రెస్టారెంట్ లో ఓ జంటకు అవమానం

Advertisment
తాజా కథనాలు