ISRO: మరో చరిత్ర సృష్టించనున్న ఇస్రో.. డిసెంబర్ 4న సరికొత్త ప్రయోగం

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) మరో చరిత్ర సృష్టించనుంది. సూర్యుని రహస్యాలు తెలుసుకునేందుకు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. డిసెంబర్‌ 4న ప్రోబా-3 మిషన్‌ను ఏపీలోని శ్రీహరికోట నుంచి ఇస్రో ఆధ్వర్యంలో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించనునుంది.

ISRO
New Update

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) మరో చరిత్ర సృష్టించనుంది. సూర్యుని రహస్యాలు తెలుసుకునేందుకు మరో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఇటీవల ఇస్రో ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రోబా-3 మిషన్‌ను ప్రయోగించేందుకు రెడీ అవుతోంది. భారత్‌తో పాటు వివిధ దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం కోసం పనిచేశారు. ఇక మిషన్‌ను ప్రయోగించే బాధ్యతను ఇస్రో తీసుకోనుండగా.. శాటిలైట్‌ను నింగిలోకి రాకెట్ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ తీసుకెళ్లనుంది. 

Also Read: EVMలను హ్యాక్ చేయగలనంటూ యువకుడు సవాల్.. షాక్ ఇచ్చిన పోలీసులు

ISRO To Launch ESA's Proba-3 Mission

డిసెంబర్ 4న ఏపీలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రోబా-3 మిషన్‌ను ప్రయోగించనుందని ఇస్రో తెలిపింది. ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ సాయంతో ప్రోబా-3 ప్రయోగం చేపట్టనున్నారు. బుధవారం సాయంత్రం 4.08 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. మిషన్‌లో 550 కిలోల వరకు బరువున్న శాటిలైట్లను ప్రత్యేక దీర్ఘవృత్తాకార కక్ష్యలో ఉంచనున్నట్లు ఇస్రో తెలిపింది. 

ఇది కూడా చూడండి: విషాదం.. అభిమానుల మధ్య ఘర్షణ.. వందమందికి పైగా..

ఈ ప్రయోగంలో యూరోపియన్ ఏజెన్సీ సూర్యుడి వాతావరణంలో బయటి, అత్యంత వేడిపొర అయిన సోలార్‌ కరోనాను అధ్యయనం చేయనుంది. ఈ ప్రోబా-3 మిషన్‌లో ప్రయోగించిన శాటిలైట్లు అర్టిఫిషియల్ సూర్యగ్రహణ పరిస్థితులను సృష్టిస్తాయి. ఆ తర్వాత సుర్యూడి బయటి పొర అయిన కరోనాను అధ్యయనం చేస్తాయి. ఈ జంట శాటిలైట్లలో ఒకదానిలో కరోనాగ్రాఫ్ ఉంటుంది. మరోటి అల్టరర్‌ను కలిగి ఉంటుంది. ఈ శాటిలైట్లలో ఒకటి సూర్యుడిని కనిపించకుండా కృత్రిమ గ్రహణం పరిస్థితిని సృష్టిస్తే.. మరొకటి కరోనాను గమనిస్తూ వస్తుంది.  

Also Read: యూపీ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఆ ప్రాంతం ఇక మహాకుంభమేళ జిల్లా

స్పెయిన్, బెల్జియం, ఇటలీ, స్విట్జర్లాండ్, పోలాండ్ శాస్త్రవేత్తల కృషి ఫలితమే ప్రోబా- మిషన్ 3. ఈ మిషన్‌ను తయారు చేసేందుకు రెండేళ్ల సమయం పట్టింది. అయితే ఈ శాటిలైట్లు నిర్ణీత కక్ష్యలోకి చేరుకోవడం ఎంతో కీలకం. ఎందుకంటే ఇవి ఒకదానితో మరొకటి సమన్వయం చేసుకుంటూ కరోనాపై అధ్యయనం చేస్తాయి. ఈ రెండిట్లో ఏ ఒక్కటి కూడా పనిచేయకపోయినా రెండో శాటిలైట్‌కు ఉపయోగం లేకుండా పోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

ఇది కూడా చూడండి: మహిళలకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

 

#esa-proba-3-mission #telugu-news #national-news #isro
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe