/rtv/media/media_files/2026/01/02/fotojet-6-2026-01-02-21-38-44.jpg)
Gali Janardhana Reddy vs Nara Bharat Reddy
Ballari : స్టీల్ సిటీ బళ్లారిలో రెండు రెడ్ల టైకూన్‌లు ఢీ కొడుతున్నాయి. ఒకరు గాలి జనార్దన్ రెడ్డి మరొకరు నారా భరత్‌రెడ్డి..ఉనికి కాపాడుకోవడానికి ఒకరు..భవిష్యత్ నిర్మించుకోవడానికి మరొకరు..దీనికి సందర్భం వాల్మీకి జయంతి..బళ్లారి సెంటర్‌ఎస్పీ సర్కిల్ ఇందుకు అడ్డా..ప్రజెంట్ సిటీ మొత్తం 144 సెక్షన్..నారా వర్సెస్ గాలి..రెండు దశాబ్ధాల ఆధిపత్య పోరు..తెల్లారితే తలలు తెగుతాయని కొందరు..ఇనుప చరిత్రను మట్టిలో కలిపేస్తానని మరికొందరు మీడియా ముందే ఛాలెంజ్ చేసుకున్నారు. అసలేంటి హంగామా..రాత్రికి రాత్రి కాల్పులు జరుపుకోవాల్సిన అవసరమేంటి..
బళ్లారిలో మొదటి నుంచీ కాంగ్రెస్‌దే హవా..సెకండ్ ప్లేస్ జేడీఎస్‌ది..బీజేపీ ఉందా లేదా అన్నట్లుండేది..1999 లో హఠాత్తుగా సోనియా బళ్లారిలో నిలబడటం..పోటీగా ఢిల్లీనుంచి ఆగమేఘాల మీద సుష్మా స్వరాజ్ రావడం..ఇండియా మొత్తం బళ్లారిపై ఫోకస్ పెట్టింది. ఆ టైమ్‌లో కాంగ్రెస్ తర్వాత జేడీఎస్ నుంచి నారా సూర్యనారాయణ రెడ్డి పొలిటికల్‌గా రైజింగ్‌లో ఉన్నారు. ఈయన తనయుడే ఇప్పుడు బళ్లారి సిటీ ఎమ్మెల్యే భరత్ రెడ్డి..అప్పట్లో గాలి బ్రదర్స్ ఎవరికీ తెలియదు..సుష్మాను ప్రసన్నం చేసుకోవడానికి జెట్ స్పీడులో బీజేపీలో చేరి..ఆమె దృష్టిలో పడ్డారు. అప్పటి నుంచీ నారా వర్సెస్ గాలిగా పొలిటికల్ ఫైట్ మొదలైంది.
2004లో వైఎస్ సీఎం కావడం..అంతవరకు ఎక్కడా వినిపించని గాలి పేరు సడెన్‌గా తెరపైకి రావడం..కాలం కలిసి రావడం..ఓబుళాపురం మైనింగ్ స్టార్ట్‌చేయడం..కోట్లకు పడగలెత్తడం..మైనింగ్ డాన్ అవ్వడం అన్నీ వాయువేగంతో జరిగిపోయాయి. బట్ అప్పటికే నారా సూర్యనారాయణ రెడ్డి గ్రానైట్ కింగ్..అపర కుబేరుడు..కానీ..మైనింగ్ ఎఫెక్ట్‌తో గాలి రాత్రికి రాత్రి ఎక్కడికో చేరుకున్నారు. సుష్మాస్వరాజ్‌తో డైరెక్ట్‌ఫోన్ చేసే స్థాయికి ఎదిగారు. 2004 నుంచి బళ్లారిలో సర్పంచ్‌దగ్గరి నుంచి మున్సిపాలిటీ..ఎంపీటీసీ.. జడ్పీటీసీ.ఎమ్మెల్యే..ఎంపీ అన్ని స్థానాల్లో గాలి హవా నడిచింది. సింపుల్‌గా చెప్పాలంటే బీజేపీ తరపున బళ్లారి జిల్లాలో కుక్క నిలబడినా గెలిచేది అలా గాలి జాతకం నడిచింది. ఈ టైమ్‌లో కాంగ్రెస్, జేడీఎస్ గాలి ధాటికి ఎగిరిపోయాయి..
బీజేపీ లీడింగ్‌లో ఉన్నప్పుడు..గాలి హవాకు బ్రేకుల్లేనప్పుడు..బళ్లారి ఎస్పీ సర్కిల్‌లో పార్టీ ఆఫీసు పక్కనే వాల్మీకి విగ్రహాన్ని ప్రతిష్టించారు. అందులో ప్రధాన పాత్ర మాజీ మంత్రి శ్రీరాములుది కూడా..గాలి జనార్దన్ రెడ్డి శ్రీరాములు..బళ్లారి చరిత్ర తిరగరాశారు.
ఆ తర్వాత మైనింగ్ డాన్‌ను అరెస్ట్‌చేయడం.. బళ్లారి జిల్లాలో బీజేపీ షెట్టర్ క్లోజ్ అవ్వడం..నారా ఫ్యామిలీ పుంజుకోవడం..నారా భరత్ పొలిటికల్ స్క్రీన్‌పైకి రావడం చకచకా జరిగిపోయాయి. జనార్దన్ రెడ్డి జైలుకు వెళ్లడంతో బళ్లారిలో కమలం రెక్కలు పూర్తిగా రాలిపోయాయి. అన్నలు కరుణాకర్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి కూడా కంప్లీట్ సైలెంట్ అయ్యారు. కాంగ్రెస్ నుంచి భరత్ నవ కెరటంగా యువతతో హల్ చల్ చేశాడు. ముఖ్యంగా శ్రీరాములు అనుచరులను తన వైపు తిప్పుకున్నాడు.
చివరకు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారికి రావాలన్నా సుప్రీం కోర్టు పర్మిషన్ తీసుకుని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో..బళ్లారిలో ఆయన ప్రభావం పూర్తిగా పోయిందనే చెప్పొచ్చు. ఇదే ఆయన్ను తీవ్రంగా బాధిస్తోంది. గంగావతి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా మనసంతా బళ్లారిమీదే ఉంది. అందుకే బళ్లారిలో పట్టు నిలుపుకోవాలని..వచ్చే ఎన్నికల్లోగా జిల్లా మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలని ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటున్నారు. ఇదే సమయంలో వాల్మీకి జయంతికి విగ్రహ ప్రతిష్ట ఎపిసోడ్ కలిసొచ్చిందనుకున్నారు. అర్ధరాత్రి మందీ మార్బలంతో బళ్లారిలో అడుగు పెట్టారు.
ఇదే కాన్సెప్ట్‌ను ప్రిస్టేజియస్‌గా తీసుకున్న భరత్ రెడ్డి..పొలిటికల్ మైలేజ్ పెంచుకోవాలని దూకుడుమీదున్నాడు.. రెండు కోట్ల రూపాయలతో వాల్మీకి విగ్రహాన్ని..అయోధ్య రామ్ లుల్లాను శిల్పాన్నిచెక్కిన అరుణ్‌యోగిరాజ్‌తో తయారు చేయించాడు..ఈ విగ్రహ ప్రతిష్ట జరగనున్న ఎస్పీ సర్కిల్, జనార్దన్ రెడ్డి నివాసం ఉండే హవంబావి, మాజీ మంత్రి శ్రీరాములు ఏరియా దేవీ నగర్ మొత్తం వాల్మీకి వర్గంవారే ఉంటారు. వీళ్లంతా ఇప్పుడు భరత్‌కే జై కొడుతున్నారు. దీంతో అటు గాలికి, ఇటు శ్రీరాములుకు అన్ని రకాలుగా తేడా కొడుతోంది. అందుకే హఠాత్తున గంగావతి నుంచి బళ్లారిలో అడుగు పెట్టిన జనార్దన్ రెడ్డి వాల్మీకి జయంతి రోజు ఏం చేస్తారోనని సిటీ మొత్తం హాట్ టాపిక్‌అయ్యింది. ఆల్రెడీ కాల్పులు జరిగాయి. రాళ్లతో కొట్టుకున్నారు. ఇటు భరత్ రెడ్డి కూడా గాలి అడ్డా నుంచే మీడియాముందే గాలి చరిత్రను అంతం చేస్తానని ఓపెన్‌స్టేట్‌మెంట్ ఇచ్చారు.
అయితే ఒకప్పుడు రెబల్‌స్టార్‌గా ఉండే గాలిని ఇప్పుడు బళ్లారి జనం నమ్మడం లేదు.శ్రీరాములుకు సొంత సామాజిక వర్గంలోనే మద్దతు పూర్తిగా కొరవడింది. ఆయన ప్రధాన అనుచరులంతా భరత్ తో కలిసి నడుస్తున్నారు. భరత్ వెనుక నారా సూర్యనారాయణ రెడ్డి సీక్రెట్ ఆపరేషన్ చేస్తున్నారన్న వాదనా ఉంది. ఏది ఏమైనా బళ్లారి మొత్తం సలసల కాగుతోంది..
Follow Us