Bapatla: గ్రానెట్ క్వారీలో ఘోర ప్రమాదం.. బాపట్లలో ఆరుగురు మృతి
ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బల్లికురవ సమీపంలోని దివ్య గ్రానైట్ క్వారీలో బండరాళ్లు పడి ఆరుగురు కార్మికులు మృతి చెందారు. గ్రాంట్ రాయిని తొలగిస్తుండంగా ప్రమాదం జరిగింది. మృతులు ఒడిశా వాసులుగా ప్రాథమికంగా గుర్తించారు.