/rtv/media/media_files/2025/11/12/hot-bath-train-2025-11-12-12-08-27.jpg)
hot bath train
ప్రతిరోజూ ఎందరో ప్రయాణికులు రైలు ప్రయాణం చేస్తుంటారు. అయితే ప్రయాణీకుల సౌకర్యాన్ని పెంచడానికి రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కొత్త సేవలను తీసుకొస్తుంటుంది. అయితే ప్రస్తుతం శీతాకాలం వచ్చేసింది. ఎక్కువ దూరం ప్రయాణించేవారికి రైలు ప్రయాణాలు చాలా ఇబ్బందిగా ఉంటాయి. ఎందుకంటే చలి తీవ్రత అధికంగా ఉండటం వల్ల కనీసం స్నానం కూడా చేయరు. దీనివల్ల ఇంకా చిరాకుగా ఉంటుంది. అయితే ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు ఉండకూడదని రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చూడండి: Golden Gifts: గోల్డ్ గిఫ్ట్ గా ఇస్తున్న కంపెనీ..! వెంటనే జాయిన్ అయిపోండి.. ఎక్కడంటే..?
వేడి నీటి స్నానం..
రైలులో స్నానం చేయడానికి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో వేడి నీటిని అందించనుంది. జర్నీలో వేడి స్నానం చేయాలనుకుంటే వారు మాత్రం తప్పకుండా ఢిల్లీ నుంచి కశ్మీర్ వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించాలి. అయితే ఈ వేడి నీటి కోసం ఎంత ఛార్జ్ చెల్లించాలని కొందరు ఆలోచిస్తారు. అయితే ఫస్ట్ ఏసీ ప్రయాణీకులకు ఉచిత హాట్ షవర్లు లభిస్తాయి. ఎలాంటి అదనపు ఛార్జీ కూడా లేదు. ఈ సేవ ఫస్ట్ ఏసీ ఛార్జీలో మాత్రమే ఉంది. వీటితో పాటు రాజధాని, దురంతో, ఇతర సూపర్‌ఫాస్ట్ రైళ్ల వంటి కొన్ని ప్రత్యేక రైళ్లలో మొదటి AC కోచ్‌లలోని ప్రయాణీకులకు హాట్ షవర్ సేవలు అందిస్తారు.
ఇది కూడా చూడండి: Aadhaar New App: ఆధార్‌లో పేరు, పుట్టిన తేదీ, అడ్రస్ మార్చుకోవాలా.. కొత్త యాప్ వచ్చేసిందిగా
Follow Us