జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్‌ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్‌ ఉందా చూసుకోండి మరి!

లక్షలాది బ్యాంక్ ఖాతాలను ప్రభావితం చేసే కీలకమైన మార్పులను 2025 జనవరి 1న ఆర్​బీఐ అమల్లోకి తీసుకురాబోతుంది.మూడు రకాల బ్యాంకు ఖాతాలను ఆర్బీఐ బుధవారం నుంచి క్లోజ్‌ చేయనుంది.మరి ఇందులో మీ అకౌంట్‌ కూడా ఉందేమో చూసుకోండి.

New Update
RBI

RBI: బ్యాంక్ అకౌంట్‌ ఉన్నవారందరికి బిగ్ అలర్ట్. దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ ఖాతాలను ప్రభావితం చేసే కీలకమైన మార్పులను 2025 జనవరి 1న ఆర్​బీఐ అమల్లోకి తీసుకురాబోతుంది. ఈ మార్పులపై అవగాహన ఉండటం, లేట్‌ అవ్వకముందే మేల్కోవడం చాలా బెటర్‌. లేకపోతే మీ బ్యాంక్ ఖాతా యాక్సెస్​ను కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి.

Also Read: South Korea: ఫ్లైట్ అంటే భయపడుతున్నారు..68వేల బుక్సింగ్స్ క్యాన్సిల్

బ్యాంకింగ్ లావాదేవీల భద్రత, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో మూడు రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ అనుకుంటుంది. వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా హ్యాకింగ్​ను అరికట్టడం, బ్యాంకింగ్‌ రంగంలో డిజిటలైజేషన్, ఆధునికీకరణను ప్రోత్సహించడమే ప్రధానంగా పెట్టుకుంది. 

Also Read: Kushboo: బీజేపీ నన్ను పట్టించుకోవట్లేదు.. ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు!

ఈ క్రమంలో జనవరి 1 నుంచి క్లోజ్ కానున్న 3 రకాల బ్యాంక్ ఖాతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

డార్మాంట్ అకౌంట్లు

డార్మాంట్ అకౌంట్‌ అంటే రెండు సంవత్సరాలు కంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతా. మోసపూరిత కార్యకలాపాల కోసం తరచుగా ఇలాంటి ఖాతాలను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుని తమ అసాంఘిక కార్యకలాపాలను సాగిస్తుంటారు.  డార్మాంట్ అకౌంట్లను దుర్వినియోగం చేసి సొత్తును కొల్లగొట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఖాతాదారులను, బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడానికి ఆర్​బీఐ డార్మాంట్ అకౌంట్లను క్లోజ్ చేయాలని నిర్ణయం తీసుకుంది.

Also Read: Plane Crash: దక్షిణ కొరియాలో మరో విమానానికి తప్పిన పెను ప్రమాదం

ఇన్​యాక్టివ్‌ అకౌంట్లు

నిర్దిష్ట కాల వ్యవధిలో లావాదేవీలు జరపని ఖాతాలను ఇన్​యాక్టివ్ అకౌంట్లుగా అధికారులు గుర్తిస్తారు. ఖాతా భద్రతను మెరుగుపరచడానికి, మోసపూరిత ప్రవర్తన ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఖాతాలను కూడా ఆర్​బీఐ మూసేయనుంది. మీకూ ఇలాంటి ఇన్​యా​క్టివ్‌ అకౌంట్‌ ఉంటే వెంటనే యాక్టివేట్ చేసుకోవడం మంచిది.

Also Read: New Year 2025: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. హైదరాబాద్‌లో రూ.149కే ఈవెంట్లో పాల్గొనే అవకాశం!

జీరో బ్యాలెన్స్ అకౌంట్లు

ఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్​ కొనసాగించే ఖాతాలు కూడా మూతపడనున్నాయి. అటువంటి ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు , ఆర్థిక నష్టాలను తగ్గించడం కోసం కస్టమర్లు తమ బ్యాంకులతో క్రియాశీల సంబంధాలను కొనసాగించేలా ప్రోత్సహించడం ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాకుండా కేవైసీ నిబంధనలను బలోపేతం చేయడం కూడా ఈ పని ముఖ్య ఉద్దేశం.

కేవైసీ అప్డేట్

రెండేళ్లుగా ఎలాంటి లావాదేవీలు జరపని ఖాతా(డార్మాంట్ అకౌంట్)ను యాక్టివేట్ చేయడానికి వెంటనే కేవైసీని పూర్తి చేయాలి. బ్యాంక్ లేదా ఆన్​లైన్​లో బ్యాంకు ఖాతా కేవైసీని అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉన్న సంగతి తెలిసిందే. దీంతో మీ బ్యాంకు ఖాతా ఇన్‌ యాక్టివ్​గా మారకుండా ఉంటుంది. బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్​గా ఉండాలంటే ఎప్పటికప్పుడు కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవాలి. అలాగే బ్యాంకు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్​ను మెయింటెన్ చేయాలి. లేదంటే అవి ఇన్​యాక్టివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు