Earth Rotating: భూమి తిరగడాన్ని ఎప్పుడైన చూశారా.. ఇదిగో వీడియో

భూమి ఎలా భ్రమిస్తుందో అనే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. భారత్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్‌ లడఖ్‌లో భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్‌లాప్స్‌లో బంధించారు. 24 గంటల పాటు టైమ్‌లాప్స్‌ను వినియోగించి ఈ వీడియో తీశారు.

New Update
Earth Rotating

Earth Rotating

భూమి తనచుట్టు తాను తిరుగుతుందన్న విషయం ఎప్పుడో చిన్నప్పుడే చదువుకున్నాం. కానీ భూమి మనకు భ్రమిస్తున్నట్లు అనిపించదు. అయితే భూమి ఎలా భ్రమిస్తుందో అనే ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. భారత్‌కు చెందిన ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్‌చుక్‌ లడఖ్‌లో భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్‌లాప్స్‌లో బంధించారు. ప్రస్తుతం హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీలో ఇంజినీర్‌-ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న అంగ్‌చుక్‌.. 24 గంటల పాటు టైమ్‌లాప్స్‌ను వినియోగించి ఈ వీడియో తీశారు. 

Also Read: బ్లాక్‌ బాక్స్‌ దొరికింది..మిస్టరీ వీడుతుందా?

మొత్తం ఒక నిమిషం వీడియోగా దీన్ని క్రోడీకరించారు. ఇందులో భూమి ఎలా భ్రమిస్తుందో క్లారిటీగా కనిపిస్తోంది. ఆకాశంలో నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే భూమి పరిభ్రమిస్తుందని అంగ్‌చుక్ తెలిపారు. దీన్ని వీడియోలో బందించడానికి చాలా ఇబ్బందులు పడ్డట్లు పేర్కొన్నారు. భూభ్రమణం గురించి విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునేందుకు ఈ వీడియో రూపొందించినట్లు పేర్కొన్నారు. 

Also Read: వ్యవసాయ, తయారీ రంగాల్లో ఇవే టాప్ 10 బడ్జెట్ హైలెట్స్

అయితే లడఖ్‌లో వీపరీతమైన శీతల పరిస్థితులు ఉండటం వల్ల వీడియో తీస్తున్న సమయంలో నాలుగు రాత్రుల్లో పలుమార్లు బ్యాటరీలు ఫెయిలయ్యాయని, టైమర్ పనిచేయలేదని అంగ్‌చుక్‌ తెలిపారు. కానీ ఎలాగైన వీడియో తీయాలనే పట్టుదలతో చివరికి విజయవంతంగా తీసినట్లు పేర్కొన్నారు.    

Also Read: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి వరాలు.. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్‌తో పాటు కేటాయింపులివే!

Advertisment
తాజా కథనాలు