America Flight Accident: బ్లాక్‌ బాక్స్‌ దొరికింది..మిస్టరీ వీడుతుందా?

వాషింగ్టన్‌ డీసీ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికులు మరణించారు

New Update
Flightt

వాషింగ్టన్‌ డీసీ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించి బ్లాక్‌ బాక్స్‌ లభ్యమైంది. అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం గాల్లోనే అమెరికా ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్ హాక్ (H-60) ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 67 మంది ప్రయాణికులు మరణించారు. జాతీయ రవాణా భద్రతా బోర్డు దర్యాప్తును చేపట్టింది. శుక్రవారం నాటికి 28 మంది మృతదేహాలను గుర్తించగా, 41 మృతదేహాలను నీటిలో నుండి బయటకు తీశారు. 

Also Read: Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!

విమానం నది అడుగుభాగంలో ఉన్నందున మిగతా మృతదేహాలు ఇంకా లభించలేదు. బ్లాక్ బాక్స్ లోని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ డేటా విశ్లేషణ ద్వారా ప్రమాదానికి గల అసలు కారణం బయటపడే అవకాశం కనపడుతుంది. 

Also Read: Budget 2025: నేడే బడ్జెట్ విడుదల.. ఈసారి నిర్మలమ్మ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎన్ని లక్షల కోట్లంటే?

బ్లాక్ బాక్స్ దొరికింది..కానీ...

ఎన్‌టీసీబీ సభ్యుడు టాడ్ ఇన్మాన్ మాట్లాడుతూ.. “బ్లాక్ బాక్స్ దొరికింది కానీ అది తేమతో నిండిపోయింది. దానిలోని డేటాను పూర్తిగా విశ్లేషించడానికి కొన్ని రోజులు పడుతుంది” అని తెలిపారు. ఈ ప్రమాదానికి హెలికాప్టర్ కారణమా? లేక ఇతర సాంకేతిక లోపమా? అనే దానిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ప్రమాదం తర్వాత విమాన శకలాలు పోటోమాక్ నదిలో పడిపోయాయి. వాషింగ్టన్ రోనాల్డ్ రీగన్ అంతర్జాతీయ విమానాశ్రయం లో ల్యాండ్ కావాల్సిన ఈ విమానం కాన్సాస్ సిటీ నుండి వాషింగ్టన్ కు వస్తోంది.ఈ విమాన ప్రమాదంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. “ఆకాశం నిర్మలంగా ఉన్నా, ఈ ప్రమాదం ఎలా జరిగింది? హెలికాప్టర్ ఎందుకు విమానం వైపుగా కదిలింది? పైలట్ ఎందుకు తప్పించుకోలేకపోయాడు?” అని ప్రశ్నించారు. 

ఈ ప్రమాదం జరిగిన సమయంలో ట్రంప్ వైట్ హౌస్ లో ఉన్నారని సమాచారం. వైట్ హౌస్ నుండి విమానాశ్రయం కేవలం 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఎన్‌టీఎస్‌బీ దర్యాప్తు పూర్తి అయిన తర్వాత మాత్రమే అసలు నిజం బయటకు వస్తుంది.

Also Read: Ukrain: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం..వెనక్కి మళ్లుతున్న కిమ్‌ సైనికులు!

Also Read: AP-Mumbai: ఏపీ యువతిని ముంబైలో రేప్ చేసి చంపిన యువకుడు.. నిర్దోషిగా విడుదల చేసిన సుప్రీంకోర్టు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు