/rtv/media/media_files/2025/05/02/Jw6T2Vq4sKC5eR1B4xfF.jpg)
ఇద్దరు పోరాడితే అందులో ఒక్కరినే విజయం వరిస్తుంది. మరి రెండు దేశాలు యుద్ధం చేసి ఆ రెండు దేశాలు ఎలా గెలిచాయి. అవి ఏవో కాదు. ఇండియా, పాకిస్తాన్. ఈ దేశాలకు స్వాతంత్రం వచ్చి సరిగ్గా రెండు దశాబ్ధాలు కూడా నిండలేదు. అయినా సరే జమ్మూ కశ్మీర్ సరిహద్దు సమస్య ఖయ్యానికి కాలు దువ్వేలా చేసింది. భారత్, -పాకిస్తాన్ 1965 యుద్ధం జరిగి 55 ఏళ్లకు పైనే అయ్యింది. ఆ పోరాటంలో మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. 1965లో పాకిస్తాన్ రెండు ఆర్మీ ఆపరేషన్లను ఇండియన్ ఆర్మీ ఎలా తిప్పి కొట్టింది. అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ మూసా విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ దగ్గరకి వెళ్లి నా జవాన్ల దగ్గర పోరాడ్డానికి రాళ్లు తప్ప, ఏం లేవు అని చెప్పాడు. అప్పుడు పాక్‌కు ఎవరు సపోర్ట్ చేశారు..? ఆ యుద్ధం వల్ల ఎవరికి నష్టం జరిగింది. 1965 యుద్ధ రహస్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆపరేషన్ జిబ్రాల్టర్
భారత్ అంతర్జాతీయ సరిహద్దు దాటి పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు ఈ యుద్ధం అధికారికంగా 1965 సెప్టెంబర్ 6న మొదలైంది. కానీ, పాకిస్తాన్ సైన్యం కచ్ ప్రాంతంలోని కంజర్‌కోట్ ప్రాంతాన్ని ఆక్రమించిన 1965 ఏప్రిల్ 26న ఈ యుద్ధం ప్రారంభమైందని కొందరు చెబుతున్నారు. 1965 జులైలో పాకిస్తాన్ సైన్యం జమ్మూ కశ్మీర్‌ను ఆక్రమించుకోడానికి గొరిల్లా ఆపరేషన్ ప్రారంభించింది. దానికి జిబ్రాల్టర్ అనే పేరు పెట్టారు. పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ సూచనలతో 12 డివిజినల్ జనరల్ ఆఫీసర్, కమాండింగ్ జనరల్ అఖ్తర్ హుసేన్ మలిక్ ఆ ఆపరేషన్ ప్లాన్ చేశారు. అప్పటి విదేశాంగ మంత్రి జుల్ఫికర్ అలీ భుట్టో, విదేశాంగ మంత్రి అజీజ్ అహ్మద్‌కు కూడా దీని గురించి తెలుసు. వారు దానికి అంగీకారం కూడా తెలిపారు. ఆపరేషన్ జిబ్రాల్టర్ బాధ్యతను పాక్ సైన్యంలోని తారిక్, కాసిమ్, ఖాలిద్, సలాహుద్దీన్, గజ్నవీ అనే 5 బృందాలకు అప్పగించారు. ఈ ఆపరేషన్‌ను విజయవంతం చేయడానికి సుస్రత్ అనే మరో ఆపరేషన్ మొదలైంది. జులై 24న పాక్ ఆర్మీ టీంలు టార్గెట్‌ను చేరుకున్నాయి.
🤡 Another gem of the Indian Republic
— Buddhi (@buddhimedia) December 29, 2024
In 1965, Pakistan started a military operation called Operation Gibraltar. Its goal was to send forces into Jammu and Kashmir to stir up rebellion against India.
Pakistan hoped to take advantage of what they thought was unrest in the region… pic.twitter.com/geirKaZGyw
పాక్‌ను చిత్తు చిత్తుగా ఓడించిన ఇండియన్ ఆర్మీ
ఆ తర్వాత జరిగినవి పాకిస్తాన్ చరిత్రలోనే విషాదకరమైన చాప్టర్లుగా నిలిచిపోయాయి. పాక్ ఆర్మీ బృందాలు తమ మిషన్‌లో దారుణంగా ఫెయిల్ అయ్యాయి. ఒక్క గజ్నవీ బృందం మాత్రం కచ్‌లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించగలిగింది. కానీ ఆపరేషన్ జిబ్రాల్టర్ పూర్తిగా విఫలమైంది. పాకిస్తాన్ 1965లో ఓడిపోడానికి ముఖ్యకారణంగా సైనికులకు సరైన శిక్షణ లేదు. అలాగే పెద్దగా శక్తివంతమైన ఆయుధాలు కూడా లేవు. పాకిస్తాన్ విదేశాంగ శాఖ, నిఘా ఏజెన్సీల కంటే భారత్ చాలా మెరుగైన ఏర్పాట్లు చేసుకుంది. ప్రభావిత ప్రాంతాల్లో తలెత్తిన గందరగోళాలను అణచివేసేందుకు సమర్థవంతమైన, కఠిన చర్యలను చేపట్టింది.
Operation Riddle: During the 1965 India-Pak War, India's defensive strategy successfully repelled Pakistan's Operation Gibraltar, which aimed to infiltrate and incite rebellion in Kashmir. #SkyForce pic.twitter.com/gKtTEqvgee
— Housefull 5 (@filmhousefull) December 8, 2024
రెండు సీక్రెట్ ఆపరేషన్లు
పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ ఫెయిల్ కావడంతో తర్వాత ఆపరేషన్ గ్రాండ్ శ్లామ్ మొదలయ్యింది. జమ్మూ కశ్మీర్‌లో మోహరించిన ఇండియాన్ ఆర్మీకి సరుకుల సప్లైని అడ్డుకోవాలని పాక్ సైన్యం ప్లాన్ వేసింది. అక్కడికి ఉన్న ఒకే ఒక రైల్వే లైన్ కట్ చేయడానికి అఖ్నూర్ సెక్టార్‌ను ఆక్రమించింది. కానీ ఆ ఆపరేషన్ కూడా పూర్తిగా విఫలమైంది. 1965 ఆగస్టు 25న భారత సైన్యం దానా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది, ముజఫరాబాద్‌కు దగ్గరగా వెళ్లింది. తర్వాత ఆగస్టు 28న హాజీపీర్ పాస్‌ను కూడా ఆక్రమించింది.
1965 వార్ హీరో హవల్దార్ అబ్దుల్ హమీద్
1965 ఇండో, పాకిస్తాన్ యుద్ధంలో ఇండియా నుంచి పాల్గొన్న వీరులు వారు అంతగా బయట ప్రపంచానికి తెలియలేదు. పంజాబ్‌లోని ఖేమ్కరన్ సమీపంలోని అసల్ ఉత్తర్ యుద్ధభూమి సమీపంలో ఖననం చేయబడిన కంపెనీ క్వార్టర్‌మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్, పరమ వీర చక్ర. కొంతమంది హీరోలు మాత్రమే 1965 ఇండో-పాక్ యుద్ధంలో గుర్తించబడ్డారు. వారిలో రైల్వే ఫైర్‌మన్ చమన్ లాల్ కూడా ఉన్నాడు. ఆయనకు అత్యున్నత శౌర్య పురస్కారం, అశోక్ చక్ర లభించాయి. యుద్ధంలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు.
ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా
1965లో ఇండియా, పాక్ యుద్ధంలో భారత్ విజయం సాధించడానికి ముఖ్య కారణం అప్పటి కమాండ్ ఇన్ చీఫ్ సామ్ మానెక్‌షా. ఈయన ఫీల్డ్ మార్షల్ హోదాకు పదోన్నతి పొందిన మొదటి ఇండియన్ ఆర్మీ ఆఫీసర్. పాకిస్తాన్‌తో 1965, 1971, చైనా 1962 యుద్ధాల్లో కీలక పాత్ర పోషించారు. సామ్ మానెక్‌షా 1969 నుంచి 1973 వరకు ఆర్మీ స్టాఫ్ చీఫ్‌గా పనిచేశారు. 1963 డిసెంబర్ 4న వెస్ట్రన్ కమాండ్‌కు కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులైనప్పుడు, ఆయన ఆర్మీ కమాండర్‌గా నియమితులైన మొదటి భారతీయ కమిషన్డ్ ఆఫీసర్. 1964 నవంబర్‌లో సామ్ మానెక్‌షా తూర్పు కమాండ్‌కు నాయకత్వం వహించారు. మానెక్‌షా 1934లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం, ఇండో పాక్ 1947, 1965 యుద్ధాల్లో పని చేశారు. ఆయన సేవలకు అనేక బిరుదులు పొందారు. చివరిగా 2008లో 94ఏట మరణించారు.
(sam manekshaw | india pak war | jammu kashmir attack | jammu kashmir terror news | latest-telugu-news)