Ind-Pak war: 50 డ్రోన్లను కూల్చేశాం..భారత ఆర్మీ పోస్ట్

భారత్, పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి..పాక్ ఆర్మీ కాల్పులు చేస్తూనే ఉంది. పౌరుల వాహనాలే లక్ష్యంగా దాడులు చేస్తున్న 50 డ్రోన్లను భారత్ కూల్చేసింది. ఉదంపూర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్ కోట్ ప్రాంతాల్లో వీటిని పడగొట్టింది.

New Update
pak

India Shut down 50 Pakistan Drones

భారత, పాకిస్తాన్ సరిహద్దుల్లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నాయి. పాకిస్తాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ విరుచుకుపడింది. భారత్ కు జవాబివ్వాలనే ఉత్సాహంలో పాక్ కూడా దాడులు చేస్తోంది. జమ్మూకశ్మీర్‌, రాజస్థాన్, పంజాబ్, హరియాణా సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ఉపక్రమించింది. అయితే భారత ఆర్మీ వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టింది.  దీనిపై భారత ఆర్మీ తన సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది. పాక్ ప్రయోగించిన 50 డ్రోన్లను భారత్ కూల్చేసిందని చెప్పింది.

ఎలాంటి దాడికైనా మా దగ్గర జవాబుంది..

ఉదంపూర్, సాంబా, జమ్ము, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్ కోట్ ప్రాంతాల్లో వీటిని పడగొట్టింది.  రాజస్థాన లోని జైసల్మేర్ లోనూ పాక్ దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంది. ఎల్ 70 గన్స్, జడ్ యూ23, ఎంఎం లాంటి అధునాతన ఆయుధాలతో పాక్ డ్రోన్లను భారత్ ధ్వంసం చేసింది. ప్రజల భద్రత, దేశ సార్వభౌమత్వం కాపాడేందుకు భారత ఆర్మీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని..పాక్‌ దుర్మార్గపు కుట్రలకు స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్మీ చెప్పింది. 

today-latest-news-in-telugu

Also Read: IND-PAK WAR: పాక్ ఆర్మీ చీఫ్ ఎక్కడ?.. అరెస్ట్ అయ్యాడా? పారి పోయాడా?

Advertisment
తాజా కథనాలు