Vyomika Singh: 'నాన్న అమ్మకు చెప్పకు.. నన్ను వెళ్ళనివ్వదు'.. వ్యోమికా సింగ్ సక్సెస్ స్టోరీ ఇదే!

భారత వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ సాధించిన విజయాలు మహిళా శక్తికి నిదర్శనాలు. ఉద్యోగానికి ఎంపికైనప్పుడు 'నాన్న.. అమ్మకు చెప్పకు. ఆమె అంగీకరించదు'అని భయపడిన అమ్మాయి నేడు దేశానికే ఆదర్శంగా నిలిచారు. సక్సెస్ స్టోరీ కోసం పూర్తి ఆర్టికల్ చదవండి. 

New Update
Wing Commander Vyomika Singh

Wing Commander Vyomika Singh

Vyomika Singh: భారత వైమానిక దళానికి(Indian Air Force) చెందిన వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆమె పోరాటం, అంకితభావం సాధించిన విజయాలు మహిళా శక్తికి నిదర్శనాలు. అయితే ఒక మహిళ సక్సెస్ వెనక కుటుంబ సహకారం ఎంతో ముఖ్యమైనది. అందరిలాగే ఆడపిల్ల పోరాటంలోకి ఎందుకు అనే ప్రశ్న తనకు ఫ్యామిలీ నుంచి ఎదురైంది. కానీ తండ్రి మద్దతుతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన ఆమె స్పూర్తిదాయకమైన స్టోరీపై(Success Story) ప్రత్యేక కథనం. 

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

బాల్యంనుంచే భిన్నమైన శైలి..

భారత భద్రతకు బలమైన స్తంభంగా ఉన్న వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్.. బాల్యానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పేరెంట్స్ వెల్లడించారు. వ్యోమిక సింగ్ తండ్రి ఆర్ఎస్ నిమ్, ఆమె తల్లి కరుణ సింగ్ తమ కుమార్తె పోరాటం, విజయం పట్ల గర్వంగా ఉన్నట్లు తెలిపారు. వ్యోమిక 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి పైలట్ కావాలని కలలు కనేదని చెప్పారు. అయితే మొదట్లో ఈ విషయాన్ని తమకు చెప్పలేదని, ఆమె ఎప్పుడూ సాధారణ పిల్లల్లాగా ప్రవర్తించేదికాదని వ్యోమిక తల్లిదండ్రులు అన్నారు. 

Also Read: వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

అబ్బాయిలతోనే పోటీ..

'వ్యోమిక ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనేది. అది స్కూల్, క్రీడలు, చర్చ లేదా మరే ఇతర పోటీ అయినా.. ప్రతి రంగంలో అగ్రస్థానంలో నిలిచేది. సాధారణ పిల్లల కంటే చాలా భిన్నంగా ఉండేది. అబ్బాయిలతో సవాలుకు దిగేది. ఒకసారి అబ్బాయిని ఓడించినందుకు ఇరవై వేల బహుమతి గెలుచుకుంది. ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటుంది. అయితే అమ్మాయిలు ఇలా చేయకూడదని ఆమె తల్లి అడ్డుపడినప్పుడు వ్యోమిక ఇలా సమాధానం చెప్పింది. 'అమ్మాయికి, అబ్బాయికి మధ్య తేడా ఎందుకు ఉండాలి? అమ్మాయిలు కూడా తమకు నచ్చినది చేయగలరు' అని బలంగా వాదించింది. వ్యోమిక ఆలోచన, ఆత్మవిశ్వాసమే ఆమె విజయానికి కీలకం అయ్యాయిని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

నాన్న.. అమ్మకు చెప్పకు..

మరో సంఘటనను గుర్తుచేస్తూ.. వ్యోమిక అన్ని పరీక్షలలో ఉత్తీర్ణురాలై వైమానిక దళంలో ఎంపికైనప్పుడు 'నాన్న.. అమ్మకు చెప్పకు. ఆమె అంగీకరించదు' అని తండ్రికి చెప్పినట్లు తెలిపారు. అయితే ఈ శుభవార్తను మొదట తన తల్లితోనే పంచుకుందని గుర్తు చేశారు. మొదట తల్లి నమ్మలేదు. ఆ తర్వాత షాక్ అయిందని చెప్పారు. చివరగా వ్యోమిక తన చుట్టూ ఉన్నవారికి, ముఖ్యంగా అమ్మాయిలకు ప్రేరణగా నిలిచిందని, అమ్మాయిలు ఎవరికీ తక్కువ కాదని ఆమె సందేశం ఇచ్చిందని భావోద్వేగానికి లోనయ్యారు. 

Also Read: BIG BREAKING: జమ్ము కశ్మీర్‌కు తప్పిన భారీ ప్రమాదం.. పాక్ దాడిని తిప్పి కొట్టిన ఇండియా

 india | success-story | telugu-news | today telugu news 

 

#Indian Air Force #Success Story #today telugu news #telugu-news #india #vyomika singh
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు