PM Modi: సింధు జలాలు భారత్ వే..ప్రధాని మోదీ

పహల్గాం ఉగ్ర దాడి తర్వాత దానికి కారణం అయిన పాకిస్తాన్ పై భారత్ చాలా చర్యలు తీసుకుంది. ఇందులో సింధు జలాల ఒప్పందం రద్దు ఒకటి. దీనిపై మొట్టమొదటసారి ప్రధాని మోదీ స్పందించారు. భారత్ జలాలు ఇక మీదట ఇక్కడే ఉంటాయని చెప్పారు. 

New Update
pm

PM Modi

సింధునదీ జాలు భారత్ వి. మన దేశానికి చెందినవి ఇక్కడే ఉంటాయి. వాటిని దేశ ప్రయోజనాలకే వినియోగిస్తామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ. సింధు జలాల ఒప్పందం విరమణ తర్వాత మొదటిసారిగా ప్రధాని ఈ విషయంపై స్పందించారు. ఇంతకు ముందు భారత్ కు దక్కాల్సినవి కూడా బయటకు వెళ్ళిపోయాయి. కానీ ఇక మీదట అలా జరగదు. భారత జలాలు ఇక్కడే ప్రవహిస్తాయి..ఇక్కడే నిలుస్తాయి..దేశ ప్రజల అవసరాలను మాత్రమే తీరుస్తాయని ప్రధాన మోదీ చెప్పారు. మన దేశ జలాలు..మన హక్కు అని ఉద్ఘాటించారు. 

శిక్ష తప్పదు..

అలాగే పహల్గాం దాడి మీద మరోసారి ప్రధాని మోదీ మాట్లాడారు. ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులు, వారికి సహకరించిన వారిని శిక్షించకుండా వదిలేది లేదని మోదీ మరోసారి స్పష్టం చేశారు. భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని...వారు ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రభుత్వ సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. 

today-latest-news-in-telugu | pm modi | Indus River | pakistan

Also Read:ఛీ ఛీ.. అక్కవేనా నువ్వు..? సొంత చెల్లెళ్లని లవర్‌తో రేప్ చేయిస్తావా..!

Advertisment
తాజా కథనాలు