Vande Bharat: త్వరలో వందేభారత్‌ 4.0.. కేంద్రమంత్రి కీలక ప్రకటన

ప్రస్తుతం భారత్‌లో వందేభారత్‌ రైళ్లు నడుస్తున్న సంగతి తెవిసిందే. దీనికి సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలో వందేభారత్ 4.0ను అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.

New Update
India to develop Vande Bharat 4.0 with an eye on export ambitions

India to develop Vande Bharat 4.0 with an eye on export ambitions

ప్రస్తుతం భారత్‌లో వందేభారత్‌ రైళ్లు(vande-bharat-trains) నడుస్తున్న సంగతి తెవిసిందే. దీనికి సంబంధించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. త్వరలో వందేభారత్ 4.0ను అభివృద్ధి చేయనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఎగుమతి గిరాకీలకు అనుగుణంగా దీని డిజైన్ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాదు రైళ్ల ఆధునిక సాంకేతికత విషయంలో భారత్‌ను గ్లోబల్‌ సప్లయర్‌గా మార్చడంతో ఇదో కీలక పరిణామం కానుందని పేర్కొన్నారు. 

Also Read: ఆర్‌జేడీలో ముసలం..అభ్యర్థులకు టికెట్లిచ్చిన లాలూ.. వెనక్కి తీసుకున్న తేజస్వి..

India To Develop Vande Bharat 4.0

CII ఇంటర్నేషనల్ రైల్‌ కాన్ఫరెన్స్‌లో అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడారు. రైల్వేల అభివృద్ధిపై కేంద్రం ఫోకస్ పెట్టింది. 11 ఏళ్లలో ఏకంగా 35 వేల కిలోమీటర్ల వరకు రైల్వే ట్రాక్‌ల నిర్మాణం జరిగింది. జపాన్‌ బుల్లెట్‌ ట్రైన్ నెట్‌వర్క్‌ లాగే హైస్పీడ్ ప్యాసింజర్‌ రైలు కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ రైలు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా దాని డిజైన్‌ ఉంటుందని'' అశ్విని వైష్ణవ్‌ పేర్కొన్నారు. 

Also Read: మావోయిస్టు అగ్రనేత మల్లోజుల లొంగుబాటు..ఆయన ఉద్యమ ప్రస్థానమిదే..

Advertisment
తాజా కథనాలు