/rtv/media/media_files/2025/12/18/cji-2025-12-18-17-42-44.jpg)
అవినీతికి న్యాయవవస్థ సైతం అతీతం కాదనేది అందరికీ తెలిసిన సత్యమే. ఎంతో మంది లాయర్లు, జడ్జిలు అవినీతిగా ప్రవర్తించడం వింటూనే ఉన్నాం. అందుకే న్యాయదేవత కళ్ళకు నల్లటి గుడ్డ కట్టారని కూడా అంటారు. ఈ విషయాన్ని ఇవాళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే డైరెక్ట్ అనడం మాత్రం సంచలనం సృష్టించింది. రిటైర్మెంట్ ముందు జడ్జిలు సిక్సలు కొడుతున్నారని న్యాయవ్యవస్థలో అవినీతిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు న్యాయమూర్తులు ఇస్తున్న తీర్పులు వివాదాస్పదంగా మారడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. ఇది న్యాయవ్యవస్థకు అంత మంచిది కాదని సీజేఐ సుర్యకాంత్ అభిప్రాయపడ్డారు.
న్యాయవ్యవస్థలో అవినీతి ధోరణి..
రిటైర్మెంట్‌కు కొద్ది రోజుల ముందు రెండు వివాదాస్పద తీర్పులు ఇచ్చిన మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా జడ్జి తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన సమయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ జిల్లా కోర్టు జడ్జి నవంబర్ 30న పదవీ విరమణ చేయాల్సి ఉండగా..నవంబర్ 19న ఇచ్చిన రెండు తీర్పులు కారణంగా సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడంతో, సుప్రీంకోర్టు నవంబర్ 20న ఆయన పదవీ విరమణను ఒక సంవత్సరం వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం విచారించింది. సిక్స్‌లు కొట్టడం అనేది దురదృష్టకరమైన ధోరణి. దీనిపై నేను ఎక్కువగా వివరించదలచుకోలేదు అంటూ సూర్యకాంత్ కామెంట్ చేశారు. పదవీ విరమణకు ముందు చాలా ఆదేశాలు జారీ చేసే ధోరణి పెరుగుతోందని ఆయన ఎద్దేవా చేశారు. సస్పెన్షన్‌ను హైకోర్టులో ఎందుకు సవాలు చేయలేదని కూడా ధర్మాసనం ప్రశ్నించింది. ఇది పూర్తి కోర్టు నిర్ణయం కాబట్టి, సుప్రీంకోర్టును ఆశ్రయించడం మంచిదని న్యాయమూర్తి భావించారని అతని తరపు న్యాయవాది తెలిపారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు.. హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. తన సస్పెన్షన్ కారణాలను ఆర్టీఐ ద్వారా తెలుసుకోవడానికి న్యాయమూర్తి ప్రయత్నించడంపై కూడా కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
Follow Us