Commonwealth Games: 2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు భారత్‌ ఎంపిక

2030 కామన్‌వెల్త్ గేమ్స్‌కు భారత్‌ ఎంపికయ్యింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా2030లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ జరగనున్నాయి. కామన్‌వెల్త్‌ ఎగ్జిక్యూటీవ్ బోర్డు (EB) బుధవారం ఈ ప్రకటన చేసింది.

New Update
BREAKING

BREAKING

2030 కామన్‌వెల్త్ గేమ్స్‌(Commonwealth Games) కు భారత్‌(india) ఎంపికయ్యింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వేదికగా2030లో కామన్‌వెల్త్‌ గేమ్స్‌ జరగనున్నాయి. కామన్‌వెల్త్‌ ఎగ్జిక్యూటీవ్ బోర్డు (EB) బుధవారం ఈ ప్రకటన చేసింది. ఈ గేమ్స్ నిర్వహించేందుకు అహ్మదాబాద్‌తో పాటు నైజీరియా రాజధాని అబుజా కూడా పోటీ పడింది. 2030లో కామన్‌వెల్త్ గేమ్స్‌ నిర్వహించేందుకు ఈ రెండు దేశాలు తమ ప్రతిపాదనలు చేశాయి. చివరికి కామన్‌వెల్త్‌ స్పోర్ట్‌ ఎవాల్యుయేషన్ కమిటీ వీటిని పరిశీలిచింది. దీంతో ఎగ్జిక్యూటీవ్ బోర్డు భారత్‌లోని అహ్మదాబాద్‌ను ఎంపిక చేసింది.

Also Read: నాశనమైపోతార్రా.. టూత్‌పేస్ట్, ఈనో కూడా కల్తీనేనా.. మీ ముఖాలు మండ!

Commonwealth Games 2025

అయితే నవంబర్ 26న స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో కామన్‌వెల్త్‌ స్పోర్ట్స్‌ జనరల్ అసెంబ్లీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. దీనిపై స్పందించిన కామన్‌వెల్త్‌ స్పోర్ట్స్‌ తాత్కాలిక అధ్యక్షుడు డా. డొనాల్డ్‌ రుకరే ఇదో మైలురాయి క్షణంగా అభివర్ణించారు. మరోవైపు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష కూడా దీనిపై స్పందించారు. ఈ గేమ్స్‌ కేవలం భారతల క్రీడలు, ఈవెంట్‌ను నిర్వహించే సామర్థ్యాలను మాత్రమే కాకుండా.. 2047 వికసిత్‌ భారత్‌ వైపు వెళ్లే మా జాతీయ ప్రయాణంలో అర్థవంతమైన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. 

Also read: భూమిపై రాలిపోతున్న స్టార్‌లింక్‌ శాటిలైట్స్‌.. శాస్త్రవేత్తలు ఆందోళన

Advertisment
తాజా కథనాలు