India: ఇండోనేషియాతో భారత్ ఐదు కీలక ఒప్పందాలు

  రక్షణ, సముద్ర భద్రత, వాణిజ్య రంగంలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని భారత్, ఇండోనేషియాలు ఒప్పందం చేసుకున్నాయి. భారత గణతంత్ర దినోత్సవానికి ఈ సారి ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో వచ్చారు.

New Update
india

PM Modi, Indonesia President Prabowo Subianto


ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ఇండోనేషియా అధ్యక్షుడు సుబియాంటోతో ప్రధీని మోదీ సమావేశమై పలు అంశాల మీద చర్చించారు. ఆరోగ్యం, సముద్ర భద్రత, కల్చర్, డిజిటల్ స్పేస్ వంట రంగాల్లో ఇరు దేశాల మధ్యా ఒప్పందాలు చేసుకున్నారు. ఇండో, పసిఫిక్ ప్రాంతంలో శాంతి, భద్రత, అంతర్జాతీయ చట్టాల కొనసాగింపు ఎప్పటిలానే ఉంటుందని ప్రధాని మోదీ తెలిపారు. ఇండొనేషియాకు భారత్ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. బ్రిక్స్ కూటమిలో ఇండోనేషియా చేరేందుకు మద్దతునిస్తామని అన్నారు. 

Also Read: చెన్నై ఎయిర్ పోర్ట్ కు బాంబు బెదిరింపు..హై టెన్షన్

రెండు దేశాల మధ్యా వ్యాపారపరంగా అభివృద్ధి ఉందని...దీనిని మరింత పెంచేందుకు కృషి చేస్తామని ఇరు దేశాధినేతలు చెప్పారు. గతేడాది అది 30 బిలియన్ల డాలర్లు దాటిందని మోదీ అన్నారు. ఇండోనేషియాలోని బోరోబుదూర్ బౌద్ధ దేవాలయం, ప్రంబనన్ హిందూ దేవాలయ పరిరక్షణ, అభివృద్ధికి సహకరిస్తామని చెప్పారు. దాంతో పాటూ ఉగ్రవాద వ్యతిరేకత, డీ రాడికలైజేషన్ లో కూడా ఇరు దేశాలు ఒకదానికి ఒకటి సహకరించుకోవాలని ఒప్పందం చేసుకున్నారు. అలాగే ఇండో, పసఫిక్ సముద్ర జలాల్లో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా అన్ని దేశాల రాకపోకలూ జరగాలని రెండు దేశాధినేతలూ చర్చించుకున్నారు. 

Also Read: Medchal Murder: మేడ్చల్ మిస్టరీ మర్డర్‌లో మరో ట్విస్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు