Chennai: చెన్నై- కొచ్చి విమానానికి బాంబు బెదిరింపు..హై టెన్షన్

చెన్నై ఎయిర్ పోర్ట్ లో నిన్న అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ దగ్గర బాంబు ఉందని...పేల్చేస్తామని బెదిరించారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది. 

New Update
విమానంలో రక్తం కక్కుకుని వ్యక్తి మృతి!

శనివారం అర్ధరాత్రి కొచ్చి నుంచి చెన్నైకి ఇండిగో విమానం బయలుదేరింది. ఇందులో 171 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికి అమెరికా, కేరళకు చెందిన ఇద్దరు ట్రావెలర్స్ మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ కొట్టుకున్నారు కూడా. ఆ తరవాత తమ దగ్గర బాంబు ఉంది...పేల్చేస్తామంటూ బెదిరింపులకు దిగారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో  తెలియక తోటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు. 

చెన్నై ఎయిర్ పోర్ట్ లో టెన్షన్ వాతావరణం..

ఇంతలో పైలెట్లు, ఫ్లైట్ అటెండెంట్ లు చెన్నై ఎయిర్ పోర్టుకు బాంబు బెదిరింపు సమాచారాన్ని అందించారు. దీంతో ఎయిర్ పోర్ట్ లో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే చర్యలు తీసుకునే విధంగా సిద్ధంగా ఉన్నారు. ఈ లోపు విమానం వచ్చేలోపు చెన్నైఎయిర్ పోర్ట్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఫ్లైట్ మధ్యలోనే ఏమైనా అవుతుందేమో అన్న భయంతో బిక్కబిక్కుమటూ ఎదురు చూశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే బాంబు కోసం తనిఖీలు చేశారు. తెల్లవారు ఝాము 5 వరకు ఈ తనిఖీలు కొనసాగాయి.

మరోవైపు బాంబు బెదిరింపులకు పాల్పడిన వారిని చెన్నై ఎయిర్ పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు. విమానం సేఫ్ గా ల్యాండ్ అవడమే కాక తాము సురక్షితంగా ప్రాణాలతో బయటపడడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.  

Also Read: TS: 606 గ్రామాల్లో నాలుగు స్కీమ్ లకు శ్రీకారం...ఈ రోజు నుంచే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు