Trump Tariffs: ట్రంప్ టారీఫ్ ల వల్ల ప్రాబ్లెమ్ లేదు- భారత్

అమెరికా అధ్యక్షుడు భారత్ పై విధించిన 26 శాతం సుంకాలు ఎదురుదెబ్బ కాదని అంటున్నారు కేంద్ర ప్రభుత్వంలో ని ఓ సీనియర్ అధికారి. సుంకాల వాణిజ్యశాఖ విశ్లేషిస్తోందని..అది మిశ్రమ ఫలితంగానే తేలవచ్చని చెబుతున్నారు.

New Update
usa

Trump Tariffs

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పలు దేశాల పై ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఈ అర్థరాత్రి నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వైట్‌ హౌస్‌ లోని రోజ్‌ గార్డెన్‌ లో నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో ఈ విషయాలు వెల్లడించారు. దీనిని  ట్రంప్‌ లిబరేషన్‌ డే  గా వర్ణించారు. అమెరికా భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని.. ఇతర దేశాలు తమ పై విధిస్తున్న సుంకాల్లో తాము సగమే విధిస్తున్నట్లు తెలిపారు. అలాగే భారత్‌ పై 26 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. తనకు మోడీ గొప్ప స్నేహితుడని,అయితే భారత్‌ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని తెలిపారు. 52 శాతం సుంకాలను విధిస్తోందని...అందుకే తాము 26శాతం సుంకాలు విధించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. 

ఇదేమీ ఎదురు దెబ్బ కాదు...

ట్రంప్ టారీఫ్ వల్ల పెద్దగా నష్టమేమీ లేదని అంటున్నారు కేంద్ర ప్రభుత్వంలోని ఓ సీనియర్ అధికారి. దీనిని తాము ఎదురు దెబ్బగా భావించడం లేదని చెబుతున్నారు. ప్రతీకార సుంకాలపై కేంద్ర వాణిజ్య శాఖ విశ్లేషణ ప్రారంభించిందని తెలిపారు. ట్రంప్ టారీఫ్ లవలన భారత దేశంపై ఎంత ప్రబావం ఉంటుందని అంచనా వేస్తున్నారని చెప్పారు. అమెరికా ప్రస్తుతం చాలా ఆందోళనగా ఉంది. దీన్ని ఏ దైశమైనా తగ్గించగలిగితే...ట్రంప్ కూడా సుంకాల తగ్గింపుకు ఆలోచిస్తారని అంటున్నారు. అందువల్ల ఇది మిశ్రమ ఫలితమే తప్ప నష్టమేమీ లేదని ఉన్నతాధికారి చెప్పుకొచ్చారు. ట్రంప్‌ విధించిన 26 శాతం టారిఫ్‌లో.. 10 శాతం సుంకం ఏప్రిల్‌ 5 నుంచి అమల్లోకి వస్తుందని సదరు అధికారి తెలిపారు. మిగతా 16 శాతం ఏప్రిల్‌ 10 నుంచి విధించనున్నట్లు చెప్పారు. 

 today-latest-news-in-telugu | india | usa | trump tariffs

Also Read: Sanju Samson: రాజస్థాన్ కెప్టెన్ గా ఇకపై సంజూ..కీపింగ్ కు ఓకే..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు