Sanju Samson: రాజస్థాన్ కెప్టెన్ గా ఇకపై సంజూ..కీపింగ్ కు ఓకే..

రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా సంజూ శాంసన్ తిరిగి వచ్చేస్తున్నాడు. అతను పూర్తిగా ఫిట్ నెస్ సాధించడంతో కీపింగ్ కు ఓకే చెప్పారు. దీంతో ఇప్పటి వరకు ఇంపాక్టా ప్లేయర్ గా ఆడిన అతను ఇప్పుడు ఫుల్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టనున్నాడు. 

New Update
Sanju Samson

Sanju Samson Photograph: (Sanju Samson)

రాజస్థాన్ రాయల్స్ అసలు కెప్టెన్ సంజూ శాంసన్.  కానీ ఇప్పటివరకు అతను ఆ టీమ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గానే బరిలోకి దిగాడు. దానికి కారణం అతని చేతి వేలికి గాయమవడమే. ఇప్పుడు గాయం తగ్గింది. అతను పూర్తి పిట్ నెస్ తో ఉన్నాడు. అందుకే రాజస్థాన్ కెప్టెన్ బాధ్యతలు తిరిగి స్వీకరించనున్నాడు. అలాగే ఇక పై ఆ జట్టుకు కీపర్ గా కూడా వ్యవహరించనున్నాడు. ఇక మీదట జట్టును ముందుండి నడిపించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పటికి ఆర్ ఆర్ జట్టకు కెప్టెన్ గా రియాన్ పరాగ్ వ్యవహరించాడు.

చేతి వేలికి గాయం, ఆపరేషన్..

ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సీరీస్ లో సంజూ శాంసన్ గాయపడ్డాడు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టీ20 మ్యాచ్ అతని చేతి వేలికి గాయమైంది. ఇంగ్లాండ్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఎక్స్‌ప్రెస్ డెలివరీ శాంసన్ చూపుడు వేలికి బలంగా తగిలింది. విపరీతంగా రక్తస్రావం అయింది. అప్పటికి మ్యాచ్ కొనసాగించినా..తరువాత చేతి వేలికి ఆపరేషన్ చేయించుకోవాల్సి వచ్చింది. దాని తరువాత సంజూ పూర్తిగా కోలుకుని ఫిట్ నెస్ సాధించడానికి ఇంత టైమ్ పట్టింది. 

ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడింది. ఇందులో రెండింటిలో ఓడిపోగా..ఒకదానిలో మాత్రమే గెలిచింది. ఆర్ఆర్ నెక్స్ట్ మ్యాచ్ ఏప్రిల్ 5 పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది. దీనిలో ెలా అయినా గెలిచి ఓటముల నుంచి బయటపడాలని రాజస్థాన్ జట్టు భావిస్తోంది. ఇక మూడు మ్యాచ్ లలో సంజూ ఒక దానిలో మాత్రమే రాణించాడు. హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 66 పరుగులు చేశాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rajasthan-royals | sanju samson

Also Read: Heroine Ranya Rao: రన్యారావు నుంచి విడాకులు ఇప్పించండి..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు