India Vs Pakistan:
ఐసీసీ ఛాంపియన్స ట్రఫీ 2025 ఆతిధ్య హక్కులు పాకిస్తాన్ దక్కించుకుంది. అయితే అక్కడ ఆట జరిగితే తాము వెళ్ళమని భారత్ కరాఖండిగా చెప్పేసింది. సెక్యురిటీ ఇష్యూస్ మూలంగా వెళ్ళేది లేదని చెప్పింది. ఈ విషయాన్ని పీసీబీ..ఐసీసీ కి చెప్పి టోర్నీ హైబ్రీడ్ మోడ్‌లో జరిగేలా చూడాలని కోరింది. అయితే ఐసీసీ దీనిపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ లోపే భారత్ కీల నిర్ణయం తీసుకుంది. రాబోయే ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, దిల్లీ కప్ టోర్నమెంట్‌ల కోసం చాలా మంది పాకిస్థాన్ ఆటగాళ్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ నిరాకరించింది. పాక్ ఆటగాళ్లు రెండు నెలల ముందుగానే దరఖాస్తులు సమర్పించినా అసలు వాటిని చూడను కూడా చూడలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏకంగా ఆటగాళ్లకు వీసాలు జారీ చేయబోమని ప్రకటించింది.
Also Read : వామ్మో ఇంటి అద్దెకు రూ.5 లక్షల అడ్వాన్స్ ఇవ్వాలటా..ఎక్కడంటే
Also Read : KTR: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?
భారత్ నిర్ణయం మీ పాక్ బోర్డు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తమ దేశానికి రమ్మంటే ఎలాగో రాలేదు. కనీసం పాక్ ఆటగళ్ళను అయినా రానివ్వడం లేదని రోపించారు పాకిస్థాన్ స్క్రాబుల్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) డైరెక్టర్ తారిక్ పర్వేజ్. జట్టులో సగం మందకి ఎలాంటి వివరణ ఇవ్వకుండా వీసా నిరాకరించారని చెప్పుకొచ్చారు. గతేడాది భారత్‌లో పోటీపడి విజయం సాధించిన ఆటగాళ్లతో సహా జట్టులోని సగం మందికి వివరణ లేకుండా వీసాలు ఇవ్వలేదు. పాకిస్తాన్ లేకుండా టోర్నీలు ఆయితే గట్ట దెబ్బే అవుతుందని అన్నారు.
Also Read : Reliance Industries: రాష్ట్రంలో రూ.65,000 కోట్ల పెట్టుబడి.. 2లక్షల 50వేలమందికి ఉద్యోగాలు
Also Read : KTR: కలెక్టర్ పై దాడి కేసులో కేటీఆర్, ఆ కీలక నేత హస్తం.. విచారణలో సంచలనాలు?