/rtv/media/media_files/2025/04/17/QBOA1tNkZrarOKLdx96U.jpg)
పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారత్ ఖండించింది. కశ్మీర్‌ను తాము మరిచిపోలేమని పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ అన్నారు. అది తమ ప్రధాన రక్తనాళమని అసిమ్ మునీర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను భారత విదేశాంగ ప్రతినిధి రణదీర జైస్వాల్ తప్పుబట్టారు. జమ్ముకశ్మీర్ భారత అంతర్భాగమని విదేశాంగ మంత్రిత్వ శాఖ మరోసారి స్పష్టం చేసింది. కార్మీర్‌ను పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆక్రమిత భూభాగాలను భారత్‌కు అప్పగించాలని డిమాండ్ చేసింది.
#WATCH | MEA Spokesperson Randhir Jaiswal hits back at Pak Army Chief’s Kashmir remark:
— Organiser Weekly (@eOrganiser) April 17, 2025
“How can anything foreign be in a jugular vein? Kashmir is a Union Territory of India. The only link with Pakistan is for it to vacate illegally occupied territories.”#PakistanArmy #PakArmy pic.twitter.com/szcyUXDG2r
Also read: Elon Musk Proposal: ఎలన్ మస్క్ ప్రపోసల్ రిజెక్ట్ చేసిన యువతి.. ఎవరో తెలుసా?
మరోవైపు ఇస్లామిక్ రిపబ్లిక్‌గా పాకిస్థాన్ ఆర్భావం గురించి జనరల్ అసిమ్ మునీర్ మాట్లాడారు. ఈక్రమంలోనే హిందువులు, ముస్లింల మధ్య విభేదాలను ఆయన ప్రస్తావించారు. హిందువుల కంటే మనం భిన్నమని మన పూర్వీకులు నమ్ముతారపి అసిమ్ మునీర్ అన్నారు. మన మతం వేరు. మన ఆచారాలు వేరు. మన సంప్రదాయాలు వేరు. మన ఆలోచనలు వేరు. మన ఆశయాలు వేరు. రెండు దేశాల సిద్ధాంతానికి ఇదే పునాదని.. అందుకే మనం ఒకటి కాదు, రెండు దేశాలు అనే నమ్మకంతో ఇది ఏర్పడిందన్నారు. ఆయన వ్యాఖ్యలపై పలువురు భారతీయ హిందువులు మండిపడ్డారు. విదేశాల్లో ఉన్న పాకిస్థానీలను ఉద్దేశించి జనరల్ మునీర్ మాట్లాడారు. 1947లో పాకిస్థాన్ పుట్టుకకు దారితీసిన రెండు దేశాల సిద్ధాంతాన్ని ఆయన సమర్థించారు. జమ్ముకశ్మీర్‌పై కొనసాగుతున్న దీర్ఘకాల వైరాన్ని పునరుద్ఘాటించారు.