/rtv/media/media_files/2025/04/17/BbNC9sKv4zCdVtO6YIy1.jpg)
ప్రపంచ కుభేరుడు ఎలన్ మస్క్‌కు 14 మంది పిల్లలు, ముగ్గురు భార్యలు. తన ఆస్తిపాస్తులకు తగ్గట్లే సంతానం కూడా ఉంది. అతను మహిళలతో పిల్లలు కనిచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఎక్కువ మందికి జన్మనివ్వాలని మస్క్ ప్రయత్నిస్తున్నాడు. మహిళలతో సీక్రెట్‌గా రిలేషన్ పెట్టుకుంటాడు. ఇదే క్రమంలో ఓ క్రిప్టో కరెన్సీ ఇన్‌ప్లుయెన్సర్ టిఫనీ ఫాంగ్‌కి ఎలన్ మస్క్ ఆఫర్ ఇచ్చాడు. అతను ఆమెతో బిడ్డను కనాలనుకుంటున్నట్లు టిఫనీకి చెప్పాడు. దానికి ఆమె ఒప్పుకోలేదని ది వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఎలన్ మస్క్ ఆమెను ఎక్స్‌తోపాటు సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో ఫాలో అవుతున్నాడు. పర్సనల్‌గా వారు చాట్ చేసుకుంటారని వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. ఆమెని ఇంప్రెస్ చేయడానికి టిఫనీ పోస్టులకు లైక్ కొట్టడం, రిప్లే ఇవ్వడం, కామెంట్ చేయడం వంటివి చేస్తుంటాడని కూడా సమాచారం.
According to the Wall Street Journal, Elon Musk asked crypto influencer Tiffany Fong over DM to have a baby with him — she turned him down.
— Republicans against Trump (@RpsAgainstTrump) April 16, 2025
After she told others, he scolded her and unfollowed her on X. Her earnings on Musk’s platform dropped significantly after she made… pic.twitter.com/7I0ccHg32H
Also read: World Press Photo of the Year: అవార్డ్ గెలుచుకున్న ఫొటో చూస్తే కన్నీళ్లు ఆగవు!
టిఫనీ ఫాంగ్ ఎవరంటే?
తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. టిఫనీ ఫాంగ్‌తో బిడ్డని కనాలనే ఉందని మస్క్ ప్రతిపాదించాడట. మస్క్ అభ్యర్థను ఆమె తిరస్కరించింది. మస్క్ తనతో ఇలా అన్నాడని ఫాంగ్ ఆమె ఫ్రెండ్స్‌కు చెప్పింది. ఈ విషయం బయటకు పొక్కడంతో మస్క్ ఆమెను అన్‌ఫాలో చేశాడు. ఫాంగ్‌కు X లో 340,000 మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. 48,000 మంది యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. టిఫనీ ఫాంగ్ 1994 మార్చి 19న లాస్ వెగాస్‌లో జన్మించింది. 2016లో దక్షిణ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీని పొందింది.
(elon-musk | Elon Musk Proposal | Tiffany Fang)