భారత్-చైనా కీలక ఒప్పందం.. సరిహద్దు నుంచి బలగాల ఉపసంహరణ

తూర్పు లడఖ్‌ సెక్టార్‌లోని డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయని భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. బ్రిక్స్ సదస్సులో జరిగిన ఒప్పందంలో భాగంగానే ఈ ప్రక్రియ మొదలైనట్లు పేర్కొన్నారు.

New Update
military vehicle

గత నాలుగేళ్లుగా భారత్, చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి ఉద్రిక్తతలు కొనసాగుతున్న సంగతి తెలిసిదే. ఇటీవలే వీటికి ముగింపు పడేలా ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. తూర్పు లడఖ్‌ సెక్టార్‌లోని రెండు ముఖ్యమైన ప్రాంతాలైన డెమ్చోక్, డెస్పాంగ్ నుంచి భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయని.. భారత రక్షణశాఖ అధికారులు శుక్రవారం తెలిపారు. ఇరుదేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగానే ఆ రెండు ప్రాంతాల్లోని సైనిక సామాగ్రి, ఇతర పరికరాలను తీసుకెళ్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ ఉన్న టెంట్లు, ఇతర తాత్కాలిక నిర్మణాలు కూడా తొలగిస్తున్నాయన్నారు. 

Also Read: బెంగళూరులో పట్టపగలే ఇద్దరు చిన్నారుల కిడ్నాప్.. తండ్రే కారణం..!

పశ్చిమం వైపు భారత్, తూర్పు వైపు చైనా

చార్దింగ్‌లా పాస్‌కు సమీపంలో ఉన్న నదికి పశ్చిమ దిశవైపు భారత బలగాలు, అలాగే తూర్పు దిశగా చైనా బలగాలు వెనక్కి వెళ్తున్నాయని తెలిపారు. అయితే ఈ ప్రాంతాల్లో సరిహద్దుల వద్ద ఇరు దేశాలకు కూడా దాదాపు 10 నుంచి 12 తాత్కాలిక నిర్మాణాలు, 12 టెంట్లు ఉన్నట్లు సమాచారం. బలగాల ఉపంసంహరణ ప్రక్రియ పూర్తయ్యాక మరో 4-5 రోజుల్లో ఇరువైపులా డెమ్చోక్, డెస్పాంగ్ ప్రాంతాల్లో పెట్రోలింగ్‌ పునరుద్ధరించనున్నట్లు తెలుస్తోంది. వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్ పునరుద్ధరణపై కూడా ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం చూసుకుంటే.. 2020 గల్వాన్ ఘర్షణలకు ముందు నాటి నుంచి యథాస్థితి ఎల్‌ఏసీ వెంబడి గస్తీ కొనసాగుతుంది. 

గస్తీ పాయింట్లకు వెళ్లొచ్చు

ఇరుదేశాల సైనికులు 2020లో పెట్రోలింగ్ నిర్వహించిన పాయింట్లకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇటీవల రష్యాలో జరిగిన బ్రిక్స్ సదస్సులో ఈ ఒప్పందాన్ని భారత ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ధ్రువీకరించారు. ఇదిలాఉండగా.. 2020లో జూన్ 15న తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్‌బాబుతో పాటు 20 మంది భారత సైనికులు వీర మరణం పొందారు. అటువైపు చైనా సైనికులు కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కానీ వాళ్లు ఎంతమంది చనిపోయారనేది మత్రం వెల్లడించలేదు.  

Also Read: పని వారిని కూడా సొంత వారిగానే...ఆస్తులు రాసిన టాటా!

చాలా నెలలు గడిచిన తర్వాత కేవలం అయిదుగురు మాత్రమే చనిపోయినట్లు అధికారికంగా ప్రకటన చేసింది. ఈ ఘర్షణలో ఇరుదేశాలు ఎల్‌ఏసీ వెంబడి భారీస్థాయిలో బలగాలను మోహరించాయి. అప్పటినుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రతిష్టంభన తొలగించేందుకు అప్పట్లో భారత్, చైనా పలుమార్లు దౌత్య, కమాండర్ స్థాయిలో చర్చలు జరిగాయి. వీటి ఫలితంగా ఇప్పటికే కొన్ని ప్రాంతాల నుంచి బలగాలు ఉపసంహరణ జరిగింది. ఇక 2020లో జరిగిన ఘర్షణకు కేంద్రమైన డెమ్చోక్, డెస్పాంగ్ వద్ద మాత్రం బలగాలు కొనసాగుతూ వచ్చాయి. ఇప్పుడు తాజాగా ఈ ప్రాంతాల్లో కూడా ఉపసంహరణ ప్రక్రియ జరిగింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు