/rtv/media/media_files/2025/08/19/sudarshan-reddy-2025-08-19-13-06-11.jpg)
ఇండియా కూటమి సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ప్రధాని నరేంద్ర మోడీ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌కు మద్దతు ఇవ్వాలని ప్రతిపక్షాలను కోరినప్పటికీ తమ తరుపున అభ్యర్థిని బరిలోకి దింపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి ఎంపిక చేసింది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ఈ పదవికి నామినేట్ చేసింది. గత నెలలో అనారోగ్య కారణాల వల్ల ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధంఖర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి.నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ ఆగస్టు 21.
#BreakingNews | INDIA Bloc announces ex-Supreme Court judge B. Sudarshan Reddy as their unanimous Vice-Presidential candidate against NDA's choice, C.P. Radhakrishnan#VicePresidentalCandidate#BSudarshanReddy | @ShivaniGupta_5pic.twitter.com/gWnwvjbl3T
— News18 (@CNNnews18) August 19, 2025
సుదర్శన్ రెడ్డి గురించి
1946, జూలై 8న తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, ఆకుల మైలారం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1971లో న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1971 డిసెంబర్ 27న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదయ్యారు.ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సివిల్, రాజ్యాంగ సంబంధిత కేసులను ప్రాక్టీస్ చేశారు. 1988లో హైకోర్టులో ప్రభుత్వ ప్లీడర్‌గా, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు. 1993లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993 మే 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.2005 డిసెంబర్ 5న గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 జనవరి 12న భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2011 జూలై 8న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేశారు. 2013 మార్చిలో గోవా మొదటి లోకాయుక్తగా బాధ్యతలు స్వీకరించారు, కానీ వ్యక్తిగత కారణాల వల్ల అదే సంవత్సరం అక్టోబర్‌లో రాజీనామా చేశారు.
వైఎస్ జగన్‌కు ఫోన్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి(YS Jagan) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ(pm modi) సూచన మేరకు ఆయన ఈ కాల్ చేశారు. రాధాకృష్ణన్ ఏకగ్రీవ ఎన్నికకు మద్దతివ్వాలని జగన్ ను రాజ్‌నాథ్ సింగ్ కోరారు. లోక్‌సభలో వైసీపీకి 4 ఎంపీలు, రాజ్యసభలో వైసీపీకి ఏడుగురు సభ్యులున్నారు. కాగా గతంలో ఎన్డీఏ సూచించిన రాజ్యంగబద్దమైన పదవులకు వైసీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించింది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు జగన్ తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also read : CM Chandrababu: మంగళగిరిలో P4 కార్యక్రమాన్ని ప్రారంభించిన చంద్రబాబు