/rtv/media/media_files/2025/07/27/uttar-pradesh-horror-2025-07-27-07-54-12.jpg)
In Uttar pradesh Horror, Wife Poisons Husband Twice, Lover Involved In Murder Plot
ఈ మధ్యకాలంలో కుటుంబంలో జరిగే గొడవలు, వివాహేతర సంబంధాలు హత్యలకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా భర్తలను భార్యలు చంపడం, భార్యలను భర్తలు చంపుతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మరో ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఫిరోజాబాద్ జిల్లా ఉలావ్ గ్రామంలో భార్య, ఆమె ప్రియుడు కలిసి భర్త సునీల్‌కు ఇవ్వడంతో అతడు మరణించాడు. సునీల్ తల్లి ఫిర్యాదు మేరకు జులైన 24న పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read: 'I Love You' చెప్పడం లైంగిక వేధింపు కాదు.. కోర్టు సంచలన తీర్పు
సునీల్ భార్య, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. అయితే సునీల్ భార్యకు మరో వ్యక్తితో వివాహేత సంబంధం పెట్టుకున్నట్లు తెలిసిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే వాళ్లు సునీల్‌ను హతమార్చాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. దీంతో ఆహారంలో అతడికి విషం పెట్టి హత్య చేసినట్లు పేర్కొన్నారు.
Also Read: మరో శాంతి ఒప్పందానికి ట్రంప్ ప్రయత్నం..కాంబోడియా, థాయ్ లాండ్ తో చర్చలు
ఇదిలాఉండగా ఇటీవల ఓ భర్త భార్యపై కోపంతో అత్యంత కిరాతకంగా ఆమె పీకకోసి చంపాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ శివారుప్రాంతం అబ్దుల్లాపూర్ మెట్టులో జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే .. సూర్యాపేట జిల్లాకు చెందిన శ్రీనివాస్- సమ్మక్క దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మరోసారి వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో సమ్మక్క ఇంటి నుంచి వెళ్ళిపోయి.. హైదరాబాద్ లోని అబ్దుల్లాపూర్ మెట్‌లో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటుంది. ఇటీవల ఆమె మేనకోడలి బర్త్ డే ఉండడంతో.. ఆ వేడుకల్లో పాల్గొంది. దీంతో భార్యపై కోపంతో రగిలిపోతున్న భర్త శ్రీనివాస్ అక్కడికి వచ్చి కేక్‌కటింగ్ ఆమె గొంతు కోసి పారిపోయాడు. దీంతో ఆమె మృతి చెందింది.