/rtv/media/media_files/2025/04/24/9ESvmOTmKHTjfgMROWff.jpg)
Navy Officer Vinay Narwal Sister
కాల్పులు జరిగిన తర్వాత తన అన్నయ్య వినయ్ నర్వాల్ గంటన్నర పాటూ బతికే ఉన్నాడని ఆయన సోదరి చెబుతున్నారు. కానీ అప్పుడు అతనికి ఎలాంటి సహాయం అందలేదని వాపోయారు. నర్వాత్ మృతదేహానికి నివాళులు అర్పించడానిక వచ్చిన హరియాణా ముఖ్యమంత్రి సీఎం నయాబ్ సింగ్ సైనీ ఎదుట నర్వాల్ సోదరి కన్నీటి పర్యంతం అయ్యారు. తన సోదరుడిని ఎవరైనా కాపాడి ఉండాల్సిందని...అలా చేసి ఉంటే ఇప్పుడు బతికే ఉండేవారని చెప్పుకొచ్చారు. నా సోదరుడు ముస్లిం కాదని తెలిసి ఉగ్రవాదులు మూడు సార్లు కాల్చారని ఆమె చెప్పారు. వినయ్ కు న్యాం జరగాలని...అతడిని చంపినవాడి తల కవాలని ఆమె ముఖ్యమంత్రిని సైనీని డిమాండ్ చేశారు.
పెళ్లైన ఏడు రోజులకే
పెళ్లైన ఏడు రోజులకే లెఫ్టినెంట్ వినయ్ ఉగ్రవాదుల దాడులో చనిపోయాడు ఇండియన్ నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్, హిమాన్షిల పెళ్లి 2025 ఏప్రిల్ 16న జరిగింది. వారిద్దరూ హనీమూన్ కోసమని జమ్మూకశ్మీర్ కు వెళ్లారు. అక్కడ టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడిలో లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ చనిపోయాడు. తన కళ్లముందే కట్టుకున్న భర్త చనిపోవడంతో ఆమెకు ఒక్కసారిగా నోటినుంచి మాటరాలేదు. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
today-latest-news-in-telugu | navy-officers | Pahalgam attack | terrorist