Ram Mohan Naidu:  ప్రమాదంలోనే నా తండ్రిని పోగొట్టుకున్నాను...మీ బాధ అర్థం చేసుకోగలను.. రామ్మోహన్‌ నాయుడు ఎమోషన్‌

విమాన ప్రమాదంలో కుటంబసభ్యులను పోగొట్టుకున్నవారి బాధ నేను అర్థం చేసుకోగలను. ప్రమాదంలోనే నా తండ్రిని పోగొట్టుకున్నాను. ఆ బాధ నాక్కూడా తెలుసు అని కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఎమోషన్‌ అయ్యారు.

New Update
Rammohan Naidu

Rammohan Naidu

Ram Mohan Naidu:

విమాన ప్రమాదంలో కుటంబసభ్యులను పోగొట్టుకున్నవారి బాధ నేను అర్థం చేసుకోగలను. ప్రమాదంలోనే నా తండ్రిని పోగొట్టుకున్నాను. ఆ బాధ నాక్కూడా తెలుసు అని కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్‌ నాయుడు ఎమోషన్‌ అయ్యారు. అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై ఢిల్లీలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఆ తర్వాత మీడియా సమావేశంలో పలు కీలక అంశాలను వెల్లడించారు. విమాన ప్రమాదం అందరినీ షాక్‌కు గురి చేసిందన్న ఆయన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయకచర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు. గుజరాత్‌ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ యుద్ధ ప్రతిపాదికన స్పందించినట్లు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే మంటలు చెలరేగాయి. అందుబాటులో ఉన్న ఫైరింజన్‌లతో మంటలార్పి మృతదేహాలను అక్కడి నుంచి తరలించాం. దుర్ఘటనకు గల కారణాలను తెలుసుకునేందుకు ఐదుగురు సభ్యుల గల కమిటీని ఏర్పాటు చేశాం.

Also Read:'స్క్విడ్ గేమ్ 3' చివరి ట్రైలర్.. ఉత్కంఠగా మారిన గేమ్!

అవసరమైతే కమిటీలో మరింత మందిని చేరుస్తాం, కానీ సమగ్ర దర్యాప్తు చేపిస్తామన్నారు. ఘటనా స్థలంలోనే బ్లాక్‌ బాక్స్ దొరికిందని నిపుణులు దాన్ని విశ్లేషిస్తున్నారని రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఆ తర్వాత తప్పు ఎవరిదని తేలితే వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. నిపుణుల విచారణకు రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. విచారణ పూర్తి అయ్యాక మీడియాకు వెల్లడిస్తాం అని ఆయన స్పష్టం చేశారు.బోయింగ్‌ 787 సిరీస్‌ విమానాలు మొత్తం 34 ఉన్నాయన్న ఆయన ఏడు విమానాల భద్రతపై  సమీక్ష జరిందన్న ఆయన దర్యాప్తు వివరాలను త్వలలోనే వెల్లడిస్తామన్నారు. బోయింగ్‌ విమానాలను తరచూ తనిఖీలు చేయాలని ఆదేశించాం అని మంత్రి రామ్మోహన్‌ నాయుడు మీడియాకు వివరించారు.

Also Read:ఇచ్చిన అప్పు అడిగితే జైలుశిక్ష, రూ.5లక్షలు జరిమాన

విమానయాన శాఖ కార్యదర్శి మాట్లాడుతూ విమానాశ్రయం టేకాఫ్‌ తీసుకుని రెండు కి.మీ ప్రయాణించిన తర్వాత, సుమారు 650 అడుగుల ఎత్తులో ఉన్నప్పుడే విమానం కూలిపోందనన్నారు. ఏటీసీకీ పైలట్‌ మేడే కాల్‌ ఇచ్చారన్న ఆయన విమాన సిబ్బందిని ఏటీసీ సంప్రదించినా స్పందన కరువయిందన్నారు. వెంటనే సహాయబృందాలు ఘటనాస్థలానికి చేరి సహాయ చర్యలు చేపట్టాయన్నారు. రెండు గంటల్లో ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లిందన్నారు. గుజరాత్‌ ప్రభుత్వం తక్షణమే స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిందని తెలిపార. సాయంత్రం 6 గంటల వరకు పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చాయన్నారు.

Also Read:దారుణం.. భర్తకు నిప్పంటించిన భార్య

Advertisment
తాజా కథనాలు