/rtv/media/media_files/2025/11/26/costliest-car-registration-number-2025-11-26-21-16-12.jpg)
భారతదేశంలోనే అత్యంత ఖరీదైన వాహన రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్(India costliest registration number) రికార్డు హర్యానాలో నమోదైంది. అత్యంత అరుదైన ‘HR88B8888’ అనే VIP నంబర్, రాష్ట్ర రవాణా శాఖ నిర్వహించిన ఆన్‌లైన్ వేలంలో ఏకంగా రూ.1.17 కోట్లకు అమ్ముడైంది. హర్యానా(haryana) రవాణా శాఖ ఫ్యాన్సీ నంబర్‌ల కోసం ప్రతి వారం ఆన్‌లైన్‌లో వేలం నిర్వహిస్తుంది. ఈ వారం వేలంలో రూ. 50,000 కనీస ధరతో ప్రారంభమైన 'HR88B8888' నంబర్ కోసం ఏకంగా 45 మంది బిడ్డర్లు పోటీ పడ్డారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు వేలం ముగిసే సమయానికి దీని ధర ఊహించని విధంగా రూ. 1.17 కోట్ల పలికింది. మధ్యాహ్నం 12 గంటలకే ధర రూ. 88 లక్షలు దాటింది.
Also Read : UIDAI: 2 కోట్లకు పైగా ఆధార్ నంబర్లు డిలీట్..UIDAI షాకింగ్ నిర్ణయం!
Costliest Car Registration Number HR88B8888
నంబర్ ప్రత్యేకత ఏమిటి? ఈ నంబర్ ప్లేట్‌కు ఇంత ధర పలకడానికి ప్రధాన కారణం అందులోని ప్రత్యేకమైన అంకెలు. ఇందులో పెద్ద అక్షరం ‘B’ కూడా అంకె 8ని పోలి ఉండటం ఓ ప్రత్యేక ఆకర్షణ. దీనితో పాటు నంబర్‌లో వరుసగా '8' అంకెలు ఉండటంతో శుభప్రదంగా భావించి, ప్రీమియం లుక్ కోసం దీనిని అత్యంత ఖరీదుకు కొనుగోలు చేశారు. ఇందులో HR హర్యానా రాష్ట్ర కోడ్, 88 RTO లేదా జిల్లా కోడ్, B వాహన సిరీస్ కోడ్, 8888 ప్రత్యేక నాలుగు అంకెల రిజిస్ట్రేషన్ నంబర్ సూచిస్తాయి.
గతంలో కేరళకు చెందిన ఓ బిలియనీర్ తన లంబోర్గిని కారు కోసం ‘KL 07 DG 0007’ నంబర్‌ను రూ. 45.99 లక్షలకు కొనుగోలు చేశారు. ఇప్పుడు 'HR88B8888' వేలం ఆ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. భారతదేశంలో అత్యంత ఖరీదైన రిజిస్ట్రేషన్ నంబర్‌గా సరికొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. దేశంలో VIP నంబర్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.
Also Read : తల్లి చేసిన పాపానికి 6ఏళ్లు జైలులో పసిపాప.. మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
Follow Us