![SCHOOL HOLIDAYS](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2024/12/28/fljdg8vYnPi0OUPH9wBM.jpg)
SCHOOL HOLIDAYS
ప్రస్తుతం చలి వణికిస్తోంది. ఇంటి నుంచి భయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. చిన్నారుల్లు ముద్దైపోతున్నారు. ముసలి వాళ్లు గజగజ వణికిపోతున్నారు. చేతులు, కాళ్లు తిమిర్లెక్కి బయటకు అడుగుపెట్టడం లేదు. రోజు రోజుకూ చలి తీవ్రత పెరగడంతో స్కూళ్లకు, ఉద్యోగాలు వెళ్లే వాళ్లు గగ్గోలు పెడుతున్నారు.
ALSO READ: అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డ్.. క్రికెట్ చరిత్రలో ఏకైక మొనగాడు
స్కూళ్లకు సెలవులు
ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో ఉన్న అన్ని పభుత్వ, ప్రైవేట్, అంగన్‌వాడీ స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఈ సెలవులు 2025 జనవరి 1 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని తెలిపింది. రాష్ట్రంలో తీవ్రమైన చలికాల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలో మరింత చలి పెరిగింది. కావున ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతోనే ఈ సెలవులు ప్రకటించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Haryana | The state government has declared winter holidays in all private and government schools from January 1 to January 15, 2025. pic.twitter.com/rr2mSsUSQP
— ANI (@ANI) December 27, 2024
జనవరి 16 నుంచి ఓపెన్
ఎందుకంటే ఈ అధిక చలి తీవ్రత కారణంగా చాలామంది విద్యార్థులు ఎక్కువగా అనారోగ్య బారిన పడతారని.. అందువల్లనే వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణలోకి తీసుకుని సెలవులు ప్రకటించామని అధికారులు తెలిపారు. ఇక సెలవుల అనంతరం జనవరి 16వ తేదీ నుంచి పాఠశాలలు తెరవనున్నారు.
ALSO READ:: ట్రయాంగిల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. వివాహేతర సంబంధమే!
ఉత్తర్వులను పాటించాలి
అయితే స్కూల్స్ తెరచిన నాటి నుంచి ప్రస్తుత టైమ్ టేబుల్ ప్రకారమే తరగతులు నిర్వహించబడతాయని తెలిపారు. ఈ ఉత్తర్వులను పాఠశాల యాజమాన్యం కచ్చితంగా పాటించాలని.. విద్యాశాఖ అభ్యర్థించింది. ఇది రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుందని తెలిపింది. అంతేకాకుండా ఏప్రిల్, ఆగస్ట్ సమయాల్లో మాత్రం పాఠశాల కార్యక్రమాలు 15 రోజులు పొడిగించనున్నారు.
ALSO READ: ఘోరం.. వంతెనను ఢీకొట్టిన బస్సు.. 8 మంది ప్రయాణికులు మృతి!