Crime: హర్యానాలో దారుణం.. పద్ధతిగా ఉండమన్నందుకు.. ప్రిన్సిపల్‌ను పొడిచి చంపిన స్టూడెంట్స్!

హర్యానాలోని బస్ బాద్‌షాహ్‌పూర్‌లో గురు పౌర్ణమి రోజూ విద్యార్థులు గురువునే హత్య చేశారు. కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జగ్‌బీర్ సింగ్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ మాటలు నచ్చక ఇంత దారుణంగా హత్య చేశారు.

New Update
Haryana Crime News

Haryana Crime News

Crime: హర్యానాలోని హిసార్ జిల్లా బస్ బాద్‌షాహ్‌పూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురు పౌర్ణమి రోజూ విద్యార్థులు గురువునే హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కర్తార్ మెమోరియల్ సీనియర్ సెకండరీ స్కూల్లో ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న జగ్‌బీర్ సింగ్ అనే 55 ఏళ్ల విద్యావేత్త గురువారం రోజు స్కూల్ విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. వారు పాఠశాలకు శుభ్రంగా, సక్రమంగా రావాలని.. క్షవరం చేయించుకుని.. ఉతికిన దుస్తులు వేసుకుని, టక్ వేసుకుని పాఠశాలకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఇదే మాటలు ఇద్దరు విద్యార్థులకు నచ్చలేదు. ఆ మాటలని వారు మనసులో పెట్టుకుని.. ఆగ్రహంతో ఊగిపోయారు.

స్కూల్‌కి పద్దతిగా రమ్మనదుకే హత్య..

ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆ ఇద్దరు విద్యార్థులు తమ వద్దకి కత్తి తీసుకువచ్చి.. ప్రిన్సిపాల్‌పై ఉన్నట్టుండి దాడికి పాల్పడ్డారు. కడుపు, ఛాతి భాగాల్లో కత్తితో పొడవడంతో జగ్‌బీర్ సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. రక్తస్రావం అధికంగా జరిగిన నేపథ్యంలో అక్కడే ఉన్న ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు వెంటనే స్పందించి ఆయనను స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే గాయాల తీవ్రత కారణంగా చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఘటన జరిగిన వెంటనే నిందిత విద్యార్థులు అక్కడి నుంచి పరారయ్యారు.

ఇది కూడా చదవండి:  ఏపీలో దారుణం.. యజమానిని హతమార్చి పరారైన పనిమనిషి

స్కూల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. విద్యార్థులు పరారవుతున్న దృశ్యాలను గుర్తించారు. వారిలో ఒకరు హత్యకు ఉపయోగించిన కత్తిని పడేసి పారిపోతున్న దృశ్యం ఆధారాలన్నీ సేకరించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. ప్రస్తుతం వారు మైనర్లు కావడం.. అలాగే హత్యకు దారితీసిన కారణాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారి వెనుక ఎవరైనా చెపించారా..? మానసిక ఒత్తిడిలో ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. ప్రస్తుతం స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేస్తూ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇది కూడా చదవండి: చెన్నైలో ఏపీ యువకుడి భారీ మోసం.. చివరికి ఏం చేశాడంటే

crime news | Latest News | telugu-news | crime )

Advertisment
Advertisment
తాజా కథనాలు