/rtv/media/media_files/2025/02/10/P58Ju5zYJQfrGWglWCo7.jpg)
ap crime news
AP Crime: చెన్నైలోని మాధవరంలో పనిచేస్తున్న తిరుమల డెయిరీ ట్రెజరీ మేనేజర్ నవీన్ బొలినేని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కలకలం రేపుతోంది. విశాఖపట్నానికి చెందిన నవీన్ (37) గత కొంతకాలంగా చెన్నైలోని తిరుమల డెయిరీలో ట్రెజరీ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కంపెనీలో ఇటీవల నిర్వహించిన ఆడిటింగ్‌లో అతను భారీ ఆర్థిక మోసానికి పాల్పడ్డాడని వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.40 కోట్ల నిధులు అక్రమంగా తన అకౌంట్ ద్వారా మళ్లించినట్లు సమాచారం. దీనిని గమనించిన కంపెనీ మేనేజ్‌మెంట్ అతనిపై అడిగి తెలుసుకోగా. నవీన్ తన తప్పును ఒప్పుకున్నాడని సమాచారం. అయినప్పటికీ ఈ మొత్తాన్ని తాను ఒక్కరోజులో తిరిగి చెల్లిస్తానని మాటిచ్చినట్టు తెలుస్తోంది.
Also Read: Today Horoscope: నేడు ఈ రాశుల వారికి గడ్డు కాలమే.. సమస్యలు తప్పవు
40 కోట్ల మోసానికి పాల్పడి..
అయితే డబ్బును సమర్పించలేకపోయిన నవీన్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపోయాడు. చెన్నై పుళల్ ప్రాంతంలోని బ్రిటానియానగర్‌లో ఉన్న తనకు చెందిన షెడ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు తన సోదరీమణులకు ఈ-మెయిల్ పంపిన్నాడు. వెంటనే కుటుంబ సభ్యులు చెన్నై వచ్చి ఆ షెడ్ దగ్గరకు వెళ్లగా నవీన్ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఈ ఘటనపై చెన్నై సెంట్రల్ క్రైం బ్రాంచ్ ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది.
ఇది కూడా చదవండి: సిగాచీ పేలుడులో మాయమైన మేనల్లుళ్ల కోసం ఎదురు చూపులు..చివరికి మేనత్త ప్రాణాలు!!
గతనెల 24న కంపెనీ లీగల్ మేనేజర్ మొహ్మద్ తమిముల్ అన్సారి నవీన్‌పై మోసానికి సంబంధించిన ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే అప్పటివరకు నవీన్‌తో ఎలాంటి విచారణ జరపలేదని.. ఆయన పత్రాలు సమర్పించలేదని తెలిపారు. దీంతో నవీన్ ముందస్తు బెయిల్ కోసం రెండు సార్లు కోర్టులో పిటిషన్ వేసినా విచారణ వాయిదా పడింది. ఈ పరిణామాల మధ్య తీవ్ర మనోభారంతో బాధపడుతున్న ఆయన చివరికి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. తన ఆత్మహత్యకు కారణంగా ఐదుగురు అధికారులు బెదిరింపులు చేస్తున్నారని ఈ-మెయిల్‌లో పేర్కొన్నప్పటికీ.. పోలీసులపై ఎలాంటి ఆరోపణలు చేయలేదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: ఏపీలో దారుణం.. యజమానిని హతమార్చి పరారైన పనిమనిషి
Also Read: Lord's Test: ఆటకే కాదు నోటికీ పని చెప్తున్న గిల్..లార్డ్స్ టెస్ట్ లో కనిపించని బజ్ బాల్