/rtv/media/media_files/2025/04/25/TIfFvNzpUp56dUyfBIjb.jpg)
Israel's Ambassador Reuven Azar
కాశ్మీర్ ఉగ్రదాడి పెద్ద కుట్ర అంటోంది ఇజ్రాయెల్. దాని కోసం చాలారోజుల ముందు నుంచే ప్లాన్ జరిగిందని చెబుతోంది. హమాస్ నాయకులు చాలా కాలం నుంచి పాక్ లో తిష్ట వేశారని...రీసెంట్ గా వారు పీవోకే ను కూడా సందర్శించారని చెబుతున్నారు ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్. సీవోకేలో హమాస్ నేతలు జైష్ ఏ మొహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశం అయ్యారని తెలిపారు. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి, పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి ఒక్కలానే జరిగాయని ఆధారాలు చూపిస్తున్నారు. రెండింటికీ పెద్ద తేడా లేదని రూవెన్ అంటున్నారు. హమాస్ సహకారంతోనే పహల్గామ్లో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. అప్పుడు ఇజ్రాయెల్ పౌరులు సంగీత కార్యక్రమంలో ఉండగా దాడి చేశారని.. ఇప్పుడు పహల్గామ్‌లో కూడా పౌరులు సరదాగా గడుపుతున్న సమయంలో ఎటాక్ చేశారని గుర్తుచేశారు.
ఇజ్రాయెల్ మద్దతు..
దీంతో పాక్ పై అన్ని విధాలా దాడులు ప్రారంభించింది భారత్. దౌత్యపరమైన సంబంధాలను తెగ్గొట్టుకుంది. దానికి ప్రతిగా పాకిస్తాన్ కూడా అవే చర్యలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో ప్రపంచ దేశాధినేతలు అందరూ ప్రధాని మోదీకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా కాల్ చేశారని తెలుస్తోంది. తమ పూర్తి మద్దతు భారత్ కే ఉంటుందని...పాక్ ను లేపేద్దామని చెప్పినట్టు సమాచారం. ఇప్పటికే అమెరికా, రష్యా వంటి దేశాలు భారత్ కు మద్దతును ప్రకటించాయి. ఇప్పుడు ఆ లిస్ట్ లో ఇజ్రాయెల్ కూడా చేరింది.
today-latest-news-in-telugu | Pahalgam attack | israel | hamas
Also Read: Pakistan: మరో నాలుగు రోజుల్లో యుద్ధం..పాక్ ఢిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్