Pakistan: మరో నాలుగు రోజుల్లో యుద్ధం..పాక్ ఢిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్

ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరో నాలుగు నుంచి వారం రోజుల్లో యుద్ధం జరిగేలానే కనిపిస్తోందని అన్నారు పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ .  భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసి తప్పు చేసిందని ఆయన అన్నారు. 

author-image
By Manogna alamuru
New Update

భారత్ యుద్ధానికి వస్తే తాము అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే యుద్ధం తప్పేలా లేదని వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడికి, తమకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నా భారత్ వినడం లేదని ఆయన ఆరోపించారు. స్కై న్యూస్ తో మాట్లాడుతూ...పాక్ లో లష్కరే తోయిబా సంస్థ ఎప్పుడో నిర్వీర్యం అయిపోయిందని...అసలు ఉగ్రవాదానికి అందరికంటే తామే ఎక్కువ బలౌతున్నామని చెప్పుకొచ్చారు. కానీ మా మాట ఎవరూ వినడం లేదని అన్నారు. 

మాకేం సంబంధం లేదు.. 

పహల్గామ్ లో దాడి చేసిన ఉగ్రవాదులు తాము లష్కరే తోయిబా నుంచి వచ్చామని స్వయంగా ఒప్పుకున్నారు. కానీ పాక్ డిఫెన్స్ మినిస్టర్ మాత్రం అదేం లేదని బుకాయించారు. అసలు పాకిస్తాన్ లో ఉగ్రవాదమే లేదంటూ వాదించారు. తాము ఎవరినీ పెంచి పోషించడం లేదని సమర్ధించుకున్నారు. పాకిస్తాన్  ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేసింది ఎప్పుడో పాత రోజుల్లో అని..ఇప్పుడు లేదని ఖ్వాజా చెప్పుకొచ్చారు. అప్పుడు అమెరికానే తమ చేత ఉగ్రవాదాన్ని పెంచి పోషించేలా చేసిందని అన్నారు. కానీ ఇప్పుడు అనవసరంగా తమ మీద నిందలు వేస్తున్నారని అన్నారు.

అణు యుద్ధమే.. 

సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుని భారత్ పెద్ద తప్పు చేస్తోందని రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ అన్నారు. వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం ిప్పుడు అది లేకుండా ఏకపక్షంగా ఎలా రద్దు చేస్తారని అడిగారు. భారత్ కావాలని కయ్యానికి కాలు దువ్వుతోందని ఆరోపించారు. రెండు దేశాల మధ్యనా సమస్యలు ఉన్నమాట వాస్తవమే కానీ..ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు తాము మాత్రం బాధ్యులు కామని చెప్పుకొచ్చారు. భారతదేశం యుద్ధానికి సంబంధించి ఏ చొరవ తీసుకున్నా అందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ఖ్వాజా చెప్పారు. కానీ రెండు అణు సామర్ధ్యం గల దేశాలు మధ్య యుద్ధం వస్తే అది ప్రపంచానికే ప్రమాదం అని ఆయన హెచ్చరించారు. చర్చలుకు తాము సిద్ధంగానే ఉన్నామని...భారత్ కూడా దీనికి సమ్మతిస్తే బావుంటుందని రక్షణ మంత్రి అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. 

today-latest-news-in-telugu | india | pakistan | defence-minister | war 

Also Read: Pak: ఉగ్రవాదులు స్వాతంత్ర సమరయోధులు..పాక్ ఉప ప్రధాని ప్రేలాపన

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు