/rtv/media/media_files/2025/07/12/gym-viral-video-man-2025-07-12-16-51-23.jpg)
GYM Viral Video
GYM Viral Video: చాలా మంది ఫిజికల్ ఫిట్నెస్ కోసం జిమ్‌కు వెళ్లి బాగా చెమటోడుస్తారు. అదే సమయంలో హెవీ వెయిట్ ఎత్తి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. జిమ్‌లో భారీ బరువులు ఎత్తే సమయంలో ఒక యువకుడు తీవ్రంగా వణుకిపోయాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో(Shocking Video in Gym) సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read: HBD Shiva Rajkumar: 'హ్యాట్రిక్ హీరో' నిమ్మ శివన్న బర్త్ డే స్పెషల్.. ఈ విషయాలు మీకు తెలుసా!
వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న వీడియోలో సదరు యువకుడు బెంచ్ పై పడుకుని వెయిట్ లిఫ్ట్ చేస్తూ కనిపించాడు. అయితే తన సామర్థ్యానికి మించిన భారీ బరువులు ఎత్తడంతో అవి కాస్త అతని ఛాతీపై పడ్డాయి. వాటిని పైకి లేపే క్రమంలో అతని శరీరం తీవ్రంగా వణుకడం ప్రారంభించింది.
— ExpiredEntity (@TheDailyCuts) July 11, 2025
ఈ క్రమంలో అతని ముఖ కండరాలు బిగుసుకుపోయి, బలవంతంగా బరువులు ఎత్తడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే పక్కనే ఉన్నవారు గమనించి ఆ బరువును అతడి పైనుంచి కిందికి దించారు. అనంతరం జిమ్ కోచ్ వచ్చి అతడి పరిస్థితి పరిశీలించాడు. గుండె పై చెవి పెట్టి చూసినట్లు వీడియోలో కనిపిస్తుంది.
Also Read: Shilpa Shetty: అబ్బా! గ్రీన్ శారీలో ఫిదా చేస్తున్న శిల్పా.. ఫొటోలు చూస్తే చూపు తిప్పుకోలేరు!
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో జిమ్ ప్రియులు భయపడుతున్నారు. ఆ వీడియోపై చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. జిమ్ ట్రైనర్ లేకుండా పెద్ద పెద్ద బరువులు ఎత్తకూడదు అంటూ సూచిస్తున్నారు. ఇలాంటి బరువులు లిఫ్ట్ చేసే ముందు ట్రైనర్ సహాయం తీసుకోవాలని చెబుతున్నారు.