US Tariffs : అమెరికా అదనపు సుంకాలు.. భారత ప్రభుత్వ వ్యూహం

భారత్ ను దెబ్బ కొట్టడానికి అమెరికా అదనపు సుంకాలతో దాడి చేసింది. అయితే దాన్ని మన దేశం ధీటుగా ఎదురిస్తోంది. సుంకాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలను మొదలుపెట్టింది.  చైనా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు ఎగుమతి చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

New Update
us tariffs

అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఎవరేం చెప్పినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట వినకపోవడం...భారత్ పై అదనపు సుంకాలను అమలు చేయడంతో రెండు దేశాల మధ్యా సంబంధాలు దెబ్బ తిన్నాయి.  భారత్‌ తీవ్ర ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది.  అమెరికా అధ్యక్షుడు ఎన్ని సార్లు దీనిపై మాట్లాడేందుకు ప్రయత్నించినా ప్రధాని మోదీ స్పందించలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి జర్మన్ వార్తాపత్రిక 'ఫ్రాంక్‌ఫర్టర్ ఆల్గెమైన్ జైతుంగ్' సంచలన కథనాన్ని ప్రచురించింది. అదనపు సుంకాల కారణంగా కొత్త లెవీ రత్నాలు, ఆభరణాలు, దుస్తులు, పాదరక్షలు, రసాయనాలు, క్రీడా వస్తువులు, ఫర్నిచర్ లపై భారం పడనుంది. 

ఇతర దేశాలకు ఎగుమతులు..

అమెరికా విధించిన అదనపు సుంకాలను ఎదుర్కొనేందుకు భారత చర్యలను చేపట్టింది. తిరుపూర్, నోయిడా, సూరత్ వంటి కీలక కేంద్రాలలో వస్త్ర మరియు దుస్తుల తయారీదారులు ఉత్పత్తిని నిలిపివేసినట్లు భారత ఎగుమతి సంస్థల సమాఖ్య తెలిపింది. దాంతో పాటూ చిన్న వ్యాపారులకు మద్దతు ఇవ్వడానికి చైనా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ దేశాలకు వస్తువులను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అమెరికా సుంకాల పెంపుదల ప్రభావాలను అంచనా వేయడానికి ఉన్నత స్థాయి ప్రభుత్వ చర్చలు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు. అయితే అమెరికాపై భారత్ ప్రస్తుతం ఏమీ చర్యలు తీసుకోవాలని అనుకోవడం లేదని అంటున్నారు. భారతదేశ ఎగుమతి రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో రూ.25 వేల కోట్ల ఎగుమతి ప్రమోషన్ మిషన్ పై ప్రభుత్వం పని చేస్తోందని తెలుస్తోంది. దీంతో వాణిజ్య ఫైనాన్సింగ్, నియంత్రణ సమ్మతి, మార్కెట్ యాక్సెస్, నాణ్యతా ప్రమాణాలు, బ్రాండింగ్, ఇ-కామర్స్ మౌలిక సదుపాయాలు, గిడ్డంగులు, మొత్తం వాణిజ్య సులభతరం వంటి రంగాలను పరిష్కరిస్తుందని భావిస్తున్నారు.

జీఎస్టీ సర్దుబాట్లు..

అమెరికా మన దేశానికి ఇంకా కీలకమైన వాణిజ్య భాగస్వామని భావిస్తున్నామని పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం వాణిజ్యం, భౌగోళిక, రాజకీయ ఆందోళనలను విడిగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. అమెరికా సుంకాల ప్రభావాన్ని అధిగమించడానికి భారతదేశం ఇతర దేశాలతో కొత్త వాణిజ్య అవకాశాలను పెంపొందించుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోందని చెప్పారు. అదే సమయంలో దేశీయ డిమాండ్‌ను బలోపేతం చేయడానికి, వస్త్రాలు,ఆహార ప్రాసెసింగ్ వంటి కీలక దేశీయ రంగాలకు లక్ష్య ఉపశమనం అందించడానికి ప్రభుత్వం వస్తువులు,సేవల పన్ను (జిఎస్‌టి) నిర్మాణంలో సర్దుబాట్లను సమీక్షిస్తోందని గోయల్ వివరించారు. 

Also Read: Actor Lakshmi Menon summoned: పరారీలో మలయాళ నటి లక్ష్మీ మేనన్.. కిడ్నాప్ కేసులో ఆమె పేరు

Advertisment
తాజా కథనాలు