GST: జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు...ఎంత వచ్చిందంటే..

జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్ళు పెరిగాయి. దీని ద్వారా మొత్తం రూ. 1,92, 506 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇది 12.3 శాతం పెరిగింది.  తమిళనాడు, తెలంగాణ లాంటి రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్ళల్లో టాప్ లో ఉన్నాయి.

New Update
GST New Rule: జీఎస్టీ నిబంధనల్లో మార్పు.. చిన్న వ్యాపారులకు ఇబ్బందే.. 

దేశం మొత్తం మీద జనవరిలో ఆదాయం బాగా పెరిగింది. జీఎస్టీ ద్వారా ప్రభుత్వానికి చాలా ఎక్కువ ఆదాయం వచ్చింది. ఒక్క జనవరిలోనే జీఎస్టీ ద్వారా రూ.1, 95, 505 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాదితో పోలిస్తే ఇది 12.3 శాతం ఎక్కువ గా ఉండడం విశేషం. ఇందులో దేశీయ లావాదేవీలతో సమకూరిన జీఎస్టీ 10.4 శాతం పెరిగి రూ.1.47 లక్షల కోట్లకు చేరగా.. దిగుమతి వస్తువులపై విధించిన పన్నుల నుంచి వచ్చిన రెవెన్యూ 19.8శాతం పెరిగి రూ.48,382 కోట్లుగా ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు ఇదే కాలంలో రిఫండ్స్‌ కింద గవర్నమెంట్  రూ.23,853 కోట్లు విడుదల చేసింది. రిఫండ్స్‌ తర్వాత సవరణ చేసిన జీఎస్టీ వసూళ్లు రూ.1.72కోట్లుగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 

Also Read :  డిగ్రీ చేసిన వారికి గుడ్ న్యూస్.. నెలకు రూ.85,920 జీతం సంపాదించే ఛాన్స్..!

తమిళనాడు, తెలంగాణ మరికొన్ని టాప్ లో..

తమిళనాడు, మహరాష్ట్ర, గుజరాత్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్ళు బాగా పెరిగాయి. ఇక్కడ 10 నుంచి 20 శాతం వరకూ ట్యాక్స్ వసూల్ పెరిగింది. అయితే కర్ణాటక, హర్యానా, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో మాత్రం అంత పెరగలేదు. ఇక్కడ కేవలం 2 నుంచి 9 శాతం మాత్రమే జీఎస్టీ వసూల్ అయింది. అదే ఈ రాష్ట్రాల్లో కూడా పెరిగి ఉంటే...ఆదాయ మొత్తం ఇంకాస్త ఎక్కువై ఉండేదని నిపుణులు చెబుతున్నారు.  ఇలా జీఎస్టీ వసూళ్ళలో పెరుగుదల స్థిరమైనది అని..ఇది దేశ ఆర్థిక వృద్ధిలో పెరుగుదలను సూచిస్తుందని అంటున్నారు. 

Also Read: బడ్జెట్‌లో మహిళలకు శుభవార్త.. భారీగా తగ్గనున్న బంగారం ధరలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు