Rahul Gandhi: పురుషుల కన్నా మహిళలే తెలివైనవారు.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

మహిళా దినోత్సవం సందర్భంగా విపక్ష నేత రాహుల్‌ గాంధీ తన ఎక్స్‌ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. పురుషుల కన్నా మహిళలే తెలివైనవారని రాసుకొచ్చారు. ముగ్గురు లేడీ బాస్‌లు ఉన్న ఫ్యామిలీలో తాను పెరిగినట్లు పేర్కొన్నారు.

New Update
Grew up in a family where women were bosses, Says Rahul Gandhi

Grew up in a family where women were bosses, Says Rahul Gandhi

మహిళా దినోత్సవం సందర్భంగా విపక్ష నేత రాహుల్‌ గాంధీ తన ఎక్స్‌ ఖాతాలో ఓ వీడియో షేర్ చేశారు. పురుషుల కన్నా మహిళలే తెలివైనవారని రాసుకొచ్చారు. ముగ్గురు లేడీ బాస్‌లు ఉన్న ఫ్యామిలీలో తాను పెరిగినట్లు పేర్కొన్నారు. ఇటీవల రాహుల్ గాందీ కేరళలో కొందరు విద్యార్థినులతో కలిసి లంచ్‌ చేశారు. ఈ సందర్భంగా వాళ్లతో ముచ్చటించిన విషయాలను పంచుకున్నారు. 

Also Read: జేడీ(యూ)లో చేరిన నీతీశ్‌ కుమారుడు నిశాంత్‌

తమ ఫ్యామిలీకి నానమ్మ ఇందిరాగాంధీ యజమానిగా ఉన్నట్లు చెప్పారు. తమ కుటుంబంలో మహిళలే ఎక్కువగా ఉన్నారన్నారు. పురుషులు ఎక్కువగా తొందరపాటుకు గురవుతారని.. చిన్న విషయాలకే గుడ్డిగా వ్యవహరిస్తారని సెటైర్లు వేశారు. కానీ మహిళలు మాత్రం ముందుచూపుతో, దురదృష్టితో ఆలోచిస్తారని చెప్పారు. ప్రత్యక్ష అధికారం కన్నా పరోక్ష అధికారాన్ని వాడుతారని తెలిపారు. ప్రతీ మహిళలో కూడా అవగాహన, సున్నితత్వం, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటాయన్నారు. సమాజానికి ఇవి దిశా నిర్దేశాన్నిస్తాయంటూ పేర్కొన్నారు. 

Also Read: పశ్చిమాసియాలో యుద్ధం.. స్వదేశానికి చేరుకున్న 52 వేల మంది భారతీయులు

అంతేకాదు మహిళలు సొసైటీ విధించే ఆంక్షలకు లొంగకుండా సొంత వ్యక్తిత్వం, ఆశయాలకు తగ్గట్లు ముందుకు సాగాలని సూచించారు. మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి ముందుకు సాగాలన్నారు. ఇలా జరిగితేనే సమాజంలో అసాధారణ మార్పులను తీసుకురాగలరని పేర్కొన్నారు.   

Advertisment
తాజా కథనాలు