KTR-ACB: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ ఈ రోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం పది గంటల నుంచి ఆయనను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిబంధలనకు విరుద్ధంగా నిధుల మళ్లింపు, అధికారులకు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారు? తదితర ప్రశ్నలను కేటీఆర్ ను ఏసీబీ అధికారులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం.. ఈ కింది ప్రశ్నలను ఏసీబీ అధికారులు కేటీఆర్ ను అడుగుతున్నట్లు సమాచారం..
ఇది కూడా చదవండి: CM Chandrababu: ఇలా ఎవడైనా చేస్తాడా?: అధికారులపై చంద్రబాబు ఫుల్ సీరియస్!
ప్రశ్నల లిస్ట్..
1. త్రైపాక్షిక ఒప్పందం ఎప్పుడు జరిగింది ?
2. ఎన్ని సీజన్స్ కి ఒప్పందం కుదుర్చుకున్నారు ?
3. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వ బాధ్యత ఏంటి ?
4. సీజన్ 9 రేసు లో ప్రభుత్వం ఏంత ఖర్చు చేసింది ?
5. సీజన్ 10 కి , ట్రై ఒప్పందం లో ఉన్న ACE Next ఎందుకు బ్రేక్ చేసింది ?
6. ఒప్పందాన్ని బ్రేక్ చేసిన ACE Next పై ఎం చర్యలు తీసుకున్నారు ?
7. వసతుల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్న ప్రభుత్వం ,మళ్ళీ ఎందుకు స్పాన్సర్షిప్ చేయాలనుకుంది ?
8. లాస్ వచ్చింది అని ఆ కంపెనీ వెనక్కి వెళ్ళింది అంటే , ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ఆ భాద్యతలు తీసుకోవాలని ఉందా ?
9. ఆ కంపెనీ ఒప్పందం బ్రేక్ చేసింది అని మీకు ఎలా తెలిసింది ?
10. HMDA ప్రిన్సిపాల్ సెక్రటరీ కి డబ్బులు విడుదల చేయమని ఎవరు చెప్పారు ?
11. కేవలం మౌఖికంగా ఆదేశించారా ?
12. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా ఇలా డబ్బులు విడుదల చేయడం తప్పు కాదా ??
13. HMDA ప్రకారం 10 కోట్ల వరకే లావాదేవీలు చేయాల్సి ఉండగా , ఇంత పెద్ద మొత్తం లో ఎలా చేశారు ?
ఇది కూడా చదవండి: KTR: సత్యమే, న్యాయమే ఎప్పటికైనా గెలుస్తుంది
14. ఎన్ని సార్లు నిధులు విడుదల చేశారు ?
15. సీజన్ 10 ఒప్పందం ఎప్పుడు జరిగింది ?
16. మొత్తం నిర్వహణ ప్రభుత్వమే భరిస్తుంది అని ఒప్పందం చేసుకున్నారా ?
17.HMDA చైర్మన్ గా ముఖ్యమంత్రి పర్మిషన్ తీసుకున్నారా ?
18. నిధుల విడుదలకు కేబినెట్ మీటింగ్ జరిగింది ?
19.ఆర్ధిక శాఖ అనుమతులు ఉన్నాయా ?
20. నోట్ ఫైల్స్ మీద సంతకం మీరే చేశారా ??
21. నిధుల బదిలీలపై కేసీఆర్ తో చర్చించారా..?
22. కేసీఆర్‌కు తెలిసే నిధుల బదిలీ జరిగిందా..?
23. నిధుల బదిలీ తర్వాత కేసీఆర్ మిమ్మల్ని ప్రశ్నించారా..?
24. HMDA చైర్మన్‌గా కేసీఆర్‌కు ఇందులో భాగస్వామ్యం ఉందా..?