/rtv/media/media_files/2026/01/20/fotojet-2026-01-20t181651-2026-01-20-18-17-16.jpg)
Tax relief for married couples
Union Budget 2026: భారతదేశ పన్ను వ్యవస్థను సులభతరం చేయాలనే లక్ష్యంతో, 2020 బడ్జెట్(Central budjet 2026)లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Minister Nirmala Sitharaman) కొత్త పన్ను విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఈ విధానం ప్రధానంగా తక్కువ పన్ను రేట్లు, సరళమైన స్లాబ్‌లు, అనేక మినహాయింపులు, క్లిష్టమైన నియమాలను తగ్గించడంపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా వివాహిత జంటల కోసం 2026 కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం సరికొత్త ‘ఆప్షనల్ జాయింట్ టాక్సేషన్’ (Optional Joint Taxation) విధానాన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టం ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ సంపాదిస్తే తమ సంపాదనపై విడివిడిగా పన్నులు చెల్లిస్తున్నారు. అయితే,ఇకపై బడ్జెట్‌లో రానున్న కొత్త ప్రతిపాదన ప్రకారం, దంపతులను ఒకే ‘ఆర్థిక యూనిట్’గా పరిగణించే అవకాశం ఉంది. దీని వల్ల, భార్యాభర్తలు ఇద్దరూ సంపాదించినప్పటికీ కలిసి తమ ఉమ్మడి ఆదాయాన్ని ప్రకటించి, దానిపై పన్ను(Tax relief for married couples) లెక్కించవచ్చు. అభివృద్ధి చెందిన దేశాల్లో అమల్లో ఉన్న ఈ విధానం, భారతదేశంలో అమలు చేయడం వల్ల పన్ను చెల్లింపుదారులకు తమ ఆర్థిక ప్రణాళికను మరింత మెరుగ్గా రూపొందించుకోవడానికి ఉపకరిస్తుంది.
Also Read : Silver Crosses Rs 3 Lakh Mark : రూ.3 లక్షలు దాటిన వెండి ధర..ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే?
Good News For Married People - Union Budget 2026
ఈ జాయింట్ టాక్సేషన్ విధానం అమల్లోకి వస్తే, దంపతుల ఉమ్మడి పన్ను మినహాయింపు (Tax Exemption) పరిమితి గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు, విడివిడిగా ఉన్నప్పుడు లభించే ప్రామాణిక మినహాయింపుల కంటే, జాయింట్‌గా ఫైల్ చేసినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. దీనివల్ల పన్ను భారం తగ్గడమే కాకుండా, ప్రతి ఏటా భార్యాభర్తలు వేర్వేరుగా రెండు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకే ఐటీఆర్ ద్వారా దంపతులిద్దరి ఆదాయ వ్యయాలను చూపడం వల్ల పత్రాల భారం తగ్గి, ప్రక్రియ సులభతరం అవుతుంది.
ఉమ్మడి పన్ను దాఖలు విధానం అమలులోకి వస్తే, జీతం పొందే ఉద్యోగులకు వర్తించే ప్రామాణిక మినహాయింపు (సెక్షన్ 16(ia)) వంటి కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు, రిటర్న్‌ను కలిసి దాఖలు చేసినా కూడా, జీవిత భాగస్వామి స్థాయిలో విడిగా వర్తించేలా రూపకల్పన చేయవచ్చు. విధాన పరంగా చూస్తే, ఈ విధానం ద్వారా ఒకే ఆదాయంపై ఆధారపడే కుటుంబాలపై పడే పన్ను భారం సమానంగా పంచబడుతుంది. అంతేకాదు, సమాన ఆర్థిక స్థితి కలిగిన కుటుంబాల మధ్య న్యాయం ఏర్పడుతుంది మరియు పన్ను పరిపాలన మరింత సులభంగా, సమర్థవంతంగా మారుతుంది.
ఈ విధానం ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలకు మరియు కేవలం భర్త లేదా భార్య మాత్రమే సంపాదించే కుటుంబాలకు ఒక వరంగా మారుతుంది. ఒకరి ఆదాయం ఎక్కువగా ఉండి, మరొకరికి ఆదాయం లేనప్పుడు లేదా తక్కువగా ఉన్నప్పుడు, జాయింట్ ఫైలింగ్ వల్ల పన్ను స్లాబ్ రేట్లు తగ్గి, పొదుపు పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కుటుంబాల చేతిలో ఖర్చు చేయదగిన ఆదాయాన్ని పెంచుతుందని, తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగం కూడా పెరుగుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : ఆఫీసులో రాసలీలు.. కర్ణాటక డీజీపీ సస్పెండ్
Follow Us