సంక్రాంతి ఇంటికి వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) బిగ్ షాకిచ్చింది. తెలంగాణలో సంక్రాంతి పండగ రష్ ను దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ 6 వేల432 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ బస్సులు జనవరి 10, 11, 12 తేదీలలో ప్రయాణీకులను అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈ స్పెషల్ బస్సుల్లో టికెట్ ధరలను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. స్పెషల్ బస్సులకు రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్రకారం 1.50% వరకు ధరలను యాజమాన్యం సవరించింది. ఇవి తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాలకు తిరిగే బస్సులకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేసింది. నిర్వహణ ఖర్చులు పెరగడమే ధరల పెంపునకు ప్రధాన కారణమని టీజీఎస్‌ఆర్‌టీసీ పేర్కొంది. ప్రత్యేక బస్సులు మినహా సాధారణ బస్సులకు సాధారణ ఛార్జీలే ఉంటాయని టీజీఎస్‌ఆర్‌టీసీ స్పష్టం చేసింది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతి సందర్భంగా నడిచే పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ రూట్ లో బస్సులు హైదరాబాద్‌లోని ఎమ్‌జిబిఎస్, జెబిఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, అరమ్‌ఘర్, ఎల్‌బి నగర్ క్రాస్ రోడ్స్, కెపిహెచ్‌బి, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి మరియు ఇతర ప్రాంతాల నుండి బస్సులు నడుస్తాయి. తెలంగాణ అంతటా సంక్రాంతి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఇతర జిల్లాలతో పాటు అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ మరియు తిరుపతి వంటి ఇతర జిల్లాలకు టీజీఎస్ఆర్టీసీ హైదరాబాద్ నుండి బస్సులను అందిస్తుంది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుంచి హైదరాబాద్‌కు ఎలక్ట్రిక్ బస్సులు కూడా నడపనున్నారు. ఇక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ ను www.tgsrtcbus.in వెబ్ సైట్ ను సంప్రదించాలని యాజమాన్యం తెలిపింది. సంక్రాంతి స్పెషల్ బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని వెల్లడించింది. కాగా సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలతో పాటు నగరంలోని బ్యాంకులకు కూడా జనవరి 14న సెలవు ప్రకటించారు. అయితే బ్యాంకులకు సెలవులు ఒక్కరోజు మాత్రమే ఉంటుంది. జనవరి 11, 12, 19, 25, 26 తేదీల్లో సాధారణ సెలవులతో పాటు జనవరి 14న తెలంగాణ లోని బ్యాంకులు సంక్రాంతి సెలవుగా మూతపడనున్నాయి.