Parameshwara: హిందూధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదు..మరో మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..!!
బాధ్యత గల పదవిలో ఉన్న నాయకులు ప్రజలకు మేలు చేసే వ్యాఖ్యలు చేయాలి. అంతేకాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజల్లో గందరగోళం స్రుష్టించకూడదు. మొన్న సనాతన ధర్మం పై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దూమారం రేపాయి. నేడు కర్నాటక హోంమంత్రి అసలు హిందూధర్మం ఎప్పుడు పుట్టిందో తెలియదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వీరి వ్యాఖ్యలపై హిందూసంఘాలు, బీజేపీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.