/rtv/media/media_files/2025/07/20/rains-north-2025-07-20-07-25-16.jpg)
Rains and Floods In North
దేశంలో ఈ సారి అన్నిచోట్లా భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు దేశం మొత్తం వ్యాపించడంతో నార్త అంతా కూడా వానలు దంచికొడుతున్నాయి. నిన్న, మొన్న కురిసిన వర్షాలకు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ లో చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. మరోవైపు మిజోర్, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లోనూ పరిస్థితులు అల్లకల్లోలంగా తయారయ్యాయి. దీంతో పాటూ రాబోయే మూడు రోజుల్లోనూ భారీ నుంచి అతి భారీ స్థాయి వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ చెబుతోంది.
ఇప్పటి వరకు 52 మంది మృతి..
ఇక ఇప్పటి వరకు కురిసిన వర్షాల కారణంగా చాలా ప్రాంతాల్లో జనాలు మృత్యువాత పడ్డారు. బీహార్ లో పిడుగులు పడి 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ లో వరదలు, పాము కాటు కారణంగా 18 మంది మృతి చెందారు. హిమాచల్ ప్రదేశ్, అరుణా చల్ ప్రదేశ్ లలో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. అక్కడ దాదాపు 250 కు పైగా మార్గాల్లో రోడ్లు మూసేశారు. మరోవైపు రాజస్థాన్ లోని అజ్ మేర్ దర్గా దగ్గర ఆకస్మిక వరద చుట్టుముట్టుంది. ఖాజా గరీబున్ నవాజ్ దర్గా పరిసరాలను వరదనీరు ముంచెత్తింది. ఇందులో ఒక యాత్రికుడు కొట్టుకుపోతుంటే చుట్టుపక్కల ఉన్నవారు కాపాడారు.