ఏప్రిల్ 24న జరిగిన పహల్గాం ఉగ్రదాడి కీలక సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ అని ఎన్ఐఏ చెప్పింది. దాడులు చేసింది ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ముష్కరులే అయినా...వెనుక ఉండి నడిపించింది మాత్రం హఫీజ్ అనే నిఘా వర్గాలు తెలిపాయి. అతనికి పాక్ ప్రభుత్వం భారీ భద్రత కల్పించడంతో ఈ అనుమానాలు మరింత నిజమయ్యాయి. పహెల్గాం దాడి తర్వాత భారత్ టార్గెట్‌లో ఖచ్చితంగా హఫీజ్ సయీద్ ఉన్నాడని తెలిసిన పాకిస్తాన్ ప్రభుత్వం.. ఐఎస్ఐ అతనికి హై లెవల్ సెక్యూరిటీని కల్పించినట్లు సమాచారం. హఫీజ్ నివాసానికి 4 కి.మీ. మేర హై రిజెల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలియవచ్చింది.అతడు పాక్‌లో ప్రభుత్వ భద్రత మధ్య బహిరంగంగా ఉన్నాడు. మురిద్కేలో ఓ మసీదులో హఫీజ్ ఉంటున్నాడు.
మురిద్కేలో దాడులు..
నిన్న అర్థరాత్రి భారత సైన్యం పాకిస్తాన్ లోని తొమ్మది ప్రాంతాల్లో దాడులు జరిపింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద శిబిరాల మీద విరుచుకుపడింది. పక్క సమాచారం ప్రకారం దాడులు నిర్వహించినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. ఆర్మీ దాడులు చేసిన తొమ్మది ప్రాంతాల్లో మురిద్కే ఒకటి. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్తాన్ భారీ భద్రత మధ్య తలదాచుకున్నది ఇక్కడే అని తెలుస్తోంది. భారత వదిలిన మిస్సైల్స్ లో ఒకటి మురిద్కేలోని మసీదును తాకిందని ఇండియా టుడే కథనం ప్రకారం తెలుస్తోంది. ఇందులోనే హఫీజ్ సయీద్ ఉన్నాడని చెబుతున్నారు. అందువలనే అతను మరణించి ఉండవచ్చునని చెబుతున్నారు.
today-latest-news-in-telugu | india | hafiz hafiz saeed
Also Read: Operation Sindoor: 1971 తర్వాత త్రివిధ దళాలు కలిసి దాడి...ఇదే మొదటిసారి