వాహనదారులకు అలర్ట్.. ఫిబ్రవరి 17 నుంచి ఈ రూల్స్‌ మార్పు

ఇండియాలో ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ మారబోతున్నాయి. ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ విధానం అమలు లోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు చేయనుంది. ఈ రూల్స్ మీరు తెలుసుకోకుంటే ఎక్కువ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది.

New Update
Fast tag rules

Fast tag rules Photograph: (Fast tag rules)

ఫాస్ట్ ట్యాగ్ వినియోగదారులకు అలర్ట్. ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు కాబోతున్నాయి. దేశంలో ఇప్పటికే అనేక మంది వారి వాహనాలపై ఫాస్ట్ ట్యాగ్‌లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో మీరు కూడా ఫాస్ట్ ట్యాగ్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే, ఈ తాజా మార్పులను మాత్రం తప్పక తెలుసుకోండి. ఎందుకంటే ఫిబ్రవరి 17, 2025 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫాస్ట్ ట్యాగ్ రూల్స్ అమలు చేయనుంది. ఈ నియమాల ప్రకారం మీరు కొత్త చెల్లింపు విధానాలను పాటించకపోతే, అదనంగా మీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. 

Also Read: అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. శీష్‌మహల్ విచారణకు ఆదేశం

మీరు హైవేపై ప్రయాణిస్తూ ఒక జిల్లా నుంచి మరొక జిల్లా లేదా రాష్ట్రం నుంచి మరో రాష్ట్రం మారేటప్పుడు టోల్ ప్లాజా వద్ద రోడ్డు పన్ను చెల్లించడం తప్పనిసరి. కానీ ఫిబ్రవరి 17 నుంచి కొత్త ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ ధ్రువీకరణ విధానం అమల్లోకి రానుంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025 జనవరి 28న కొత్త నియమాలను జారీ చేసింది.

Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!

ఈ నిబంధనల ప్రకారం ఫిబ్రవరి 17, 2025 నుంచి టోల్ ప్లాజాకు చేరుకున్న తర్వాత 60 నిమిషాల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే, ఫాస్ట్ ట్యాగ్ బ్లాక్‌ అవుతుంది. ఆ సమయంలో చెల్లింపులు జరగవు. ఈ క్రమంలో కొత్త నియమాలకు అనుగుణంగా మీరు మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్‌ను మానిటర్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీరు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేటప్పుడు, మీ ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్‌ను చూసుకుని, అవసరమైతే ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల కొత్త మార్పులు అమల్లోకి వచ్చినప్పుడు, మీరు రెట్టింపు ఛార్జీల నుంచి తప్పించుకోవచ్చు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు