స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో ఓ నకిలీ బ్రాంచ్‌ను ఓపెన్ చేసి.. లక్షల్లో డబ్బులు దండుకున్న ఘటన ఛత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే శక్తి అనే జిల్లాలో మారుమూల ప్రాంతమైన ఛపోరా గ్రామంలో కొంతమంది వ్యక్తులు కలిసి నకిలీ బ్రాంచ్‌ను ప్రారంభించారు. కాంప్లె్క్స్‌లోని ఓ షాపును అద్దెకు తీసుకున్నారు. అది నిజమైన బ్యాంకు అని నమ్మించేందుకు ఫర్నిచర్ తీసుకొచ్చి పెట్టారు. అలాగే క్యాష్ కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో గ్రామస్థులు కూడా ఆ బ్యాంకులో డబ్బులు చేశారు. అలాగే బ్యాంకు ఉద్యోగాల పేరుతో మహిళలతో సహా ఆరుగురు వ్యక్తుల నుంచి దాదాపు రూ.2 నుంచి 6 లక్షల వరకు వసూలు చేశారు. వాళ్లకి ఫేక్ అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. బయోమెట్రిక్‌తో వారు బ్యాంకు విధులకు హాజరవుతుండేవారు. ఎస్‌బీఐ కొత్త బ్రాంచ్ ఏర్పాటుపై ఆ గ్రామస్థులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. లావాదేవీల కోసం బ్రాంచికి వెళ్తుండేవారు.
Also Read: ఈశా ఫౌండేషన్‌కు ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
పది రోజుల క్రితం ఎస్‌బీఐ ఫేక్ గురించి సమీపంలో ఉన్న దబ్రా మేనేజర్ దృష్టికి వచ్చింది. ఈ బ్రాంచ్‌పై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. చివరికి సెప్టెంబర్ 27న ఎస్‌బీఐ అధికారులు, పోలీసులు అక్కడికి వెళ్లారు. అచ్చం ఎస్‌బీఐ బ్రాంచ్ లాగే సేవలు నిర్వహించడం చూసి వాళ్లు ఒక్కసారిగా షాకైపోయారు. అలాగే ఈ ఫేక్ బ్రాంచ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఫేక్ బ్యాంకు మేనేజర్‌గా ఉన్న పంకజ్‌తో పాటు రేఖా సాహు, మందిర్ దాస్‌తో సహా నలుగురు ఈ స్కామ్‌కి పాల్పడినట్లు నిర్ధారించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఆ బ్యాంకులో కొందరు డబ్బులు పోగొట్టుకోగా.. బ్యాంకు ఉద్యోగమని నమ్మి నకిలీ నియామక పత్రాలు పొందిన వారు కూడా విషయం తెలుసుకుని కంగుతిన్నారు.