ఈషా ఫౌండేషన్‌కు ఊరట.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈశా ఫౌండేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని తమిళనాడు పోలీసులను సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే స్టేటస్ రిపోర్టు వివరాలు తమకు సమర్పించాలని సూచించింది. మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈశా ఫౌండేషన్‌పై పోలీసులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.

New Update
sadguru

ఈశా ఫౌండేషన్ మహిళలు సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తోందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఫౌండేషన్‌పై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు అందించాలని మద్రాస్‌ కోర్టు తమిళనాడు పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే ఈశా ఫౌండేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తాజాగా విచారించిన సుప్రీంకోర్టు.. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫౌండేషన్‌పై తదుపరి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే స్టేటస్ రిపోర్టు వివరాలు తమకు సమర్పించాలని సూచించింది. ఈ వ్యవహారంపై ఇద్దరు యువతుల తండ్రి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు నుంచి సుప్రీం ధర్మాసనానికి బదిలీ చేసింది.   

Also Read: జైళ్లలో కుల వివక్ష ఏంటి.. సుప్రీంకోర్టు ఆగ్రహం

ఇక వివరాల్లోకి వెళ్తే.. కోయంబత్తూరులోని ఆధ్మాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కూతుళ్లను అప్పించాలని కోరుతూ వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. తన ఇద్దరు కుమార్తెలు గీత, లత ఈశా యోగా కేంద్రంలో యోగా నేర్చుకోవడానికి వెళ్లి.. అక్కడే ఉండిపోయారని తెలిపారు. దీనిపై ఇదివరకే హెబియస్ కార్పస్ పిటిషన్‌పై మద్రాసు హైకోర్టు విచారణ జరిపిందని.. దీనిపై పరిశీలించి రిపోర్టు దాఖలు చేయాలని కోయంబత్తూరు న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చిందని పేర్కొన్నారు. ఆ తర్వాత తమను ఇబ్బందికి పెట్టకూడదని తన కూతుర్లు కూడా సివిల్ కేసు వేశారని.. దీనివల్ల తన భార్య మానసికంగా ప్రభావితమైందని పిటిషనర్ చెప్పారు.  

నా కుమార్తెలను అప్పగించండి  

అలాగే తన కూతుర్లను గదిలో నిర్బంధించి చిత్రహింసలకు కూడా గురిచేస్తున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. ఈశా యోగా సెంటర్‌కు తాను వ్యతిరేకంగా ఆందోళన చేయకూడదని.. అలా చేస్తే చనిపోయేవరకు నిరహార దీక్ష చేపడతానని రెండో కూతురు చెప్పినట్లు తెలియజేశారు. తన కుమార్తెలు ఈశా కేంద్రం నుంచి బయటికి వస్తే వాళ్లని ఇబ్బంది పెట్టమని.. ప్రత్యేక స్థలం ఇచ్చి వాళ్ల ఏకాంతాన్ని కాపాడతామని అన్నారు. వెంటనే తన కుమార్తెలను అప్పగించాలని కోరారు. మరోవైపు తన సొంత కూతురుకి పెళ్లి చేసి ఇతర పిల్లలను సన్యాసులుగా ఎందుకు మార్చాలని అనుకుంటున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు కూాడా సద్గురును ప్రశ్నిస్తున్నారు. 

Also Read: ఎంతకు తెగించార్రా.. ఐఫోన్ కోసం అలా చంపేస్తారా?

అయితే ఈ అంశంపై ఈశా ఫౌండేషన్ కూడా ఓ ప్రకటన విడుదల చేసింది. పెళ్లి చేసుకోమని లేదా సన్యాసులుగా మారాలని మేము ఎవరినీ అడగమని.. ఇవి ఆయా వ్యక్తుల వ్యక్తిగత విషయాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాదాపు 150 పోలీసులు ఆశ్రయంలోకి వచ్చి శోధించారని.. ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. హైకోర్టు ఆదేశాలపై స్టే విధించాలని కోరిన నేపథ్యంలో పోలీసుల చర్యలను కూడా ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం అక్టోబర్ 14కు వాయిదా వేసింది. 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు