ఎవర్రా మీరంతా.. ఫేక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచేశారు 😯

గుజరాత్‌లో కొందరు ఫేక్ వైద్యులు ఏకంగా ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచారు. దాని ప్రారంభోత్సవానికి పలువురు ఉన్నతాధికారులు ఆహ్వానిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరికి బండారం బయటపడింది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి.

New Update
hospi

ఫేక్ సర్టిఫికేట్లతో క్లినిక్‌లు తెరిచి ప్రజలను మోసం చేసిన ఘటనలు చాలానే జరిగాయి. తాము డాక్టర్లని చెప్పుకుంటూ క్లినిక్‌కు వచ్చే వారి నుంచి వేలు, లక్షలు దండుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా దీనికి మించి ఓ ఆసక్తికర ఘటన జరిగింది. కొందరు ఫేక్ వైద్యులు ఏకంగా ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రినే తెరిచారు. ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు ఆహ్వానిస్తున్నామని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చివరికి అసలు కథ బయటపడింది. 

Also Read: 25 నుంచి పార్లమెంట్.. జమిలీ ఎన్నికలతో పాటు రానున్న కీలక చట్టాలివే!

Fake Doctors Opens Hospital In Surat

ఇక వివారాల్లోకి వెళ్తే.. గుజరాత్‌లోని పండేసరలో ఆదివారం రోజున జనసేవ అనే మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిని ఘనంగా ప్రారంభించారు. దీనికి ఐదుగురు వ్యక్తులు వ్యవస్థాపకులుగా ఉన్నారు. తమ ఆస్పత్రి గురించి అందిరికీ తెలిసేందుకు కరపత్రాల్లో వాళ్ల విద్యార్హతల గురించి ప్రస్తావించారు. సూరత్‌ మున్సిపల్ కమిషనర్ షాలినీ అగర్వాల్, పోలీస్ కమిషనర్ అనుపమ్ సింగ్ గహ్లౌత్ అలాగే జాయింట్ కమిషర్ రాఘవేంద్ర వత్సతో సహా పలువురు ప్రముఖులు అతిథులుగా ప్రారంభోత్సవానికి రానున్నట్లు అందులో పేర్కొన్నారు. అయితే ప్రచారం గుజరాత్‌ ప్రభుత్వ దృష్టికి చేరింది.   

Also Read: ఢిల్లీలో పీక్స్‌కు చేరిన కాలుష్యం.. తర్వలో కృత్రిమ వర్షం !

దీంతో ఆ ఆస్పత్రి వ్యవస్థాపకుల ధ్రవపత్రాలు తనిఖీ చేశారు. ఎట్టకేలకు వాళ్ల బండారం బయటపడింది. ఆ ఐదుగురిలో ఇద్దరిని ఫేక్ సర్టిఫికేట్లు అని తెలిందని పోలీసులు చెప్పారు. మిగతావారి ధృవపత్రాలు కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆస్పత్రి ప్రారంభోత్సవానికి ఆహ్వానించిన విషయం కూడా తమకు తెలియదని ఆ అతిథిలు చెప్పినట్లు సమాచారం. వాళ్లెవరు కూడా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేదు. చివరికి ఆస్పత్రిని ప్రారంభించిన గంటల వ్యవధిలోనే దాన్ని అధికారులు సీల్ వేసి మూసేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుగుతోంది. 

Also Read: శబరిమలకు పోటెత్తిన స్వాములు..దర్శనానికి 10 గంటల సమయం!

Also Read :  వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఔట్.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు