/rtv/media/media_files/2025/04/30/Ym3tFvGn8CJg8dgoytF3.jpg)
Central Govt Revamps National Security Advisory Board After Pahalgam Attack
కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ (NSA) బోర్డును పునరుద్ధరించింది. RAW (రీసెర్చ్ అండ్ అనలైసిస్ వింగ్) మాజీ చీఫ్ అలోక్ జోషీని ఛైర్మన్‌గా నియమించింది. అలాగే ఈ బోర్డులో మాజీ ఎయిర్ కమాండర్ పీఎం సిన్హా, మాజీ ఆర్మీ కమాండర్ ఏకే సింగ్, నేవీ అడ్మిరల్ ఆఫీసర్ మాంటీ ఖన్నా, రిటైర్డ్ IPSలు రాజీవ్ రంజన్, మన్మోహన్ సింగ్, రిటైర్డ్ IFS బి.వెంకటేశ్ సభ్యులుగా ఉన్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీన్నిబట్టి చూస్తే.. భారత్ ఏ క్షణమైనా పాకిస్థాన్‌పై ప్రతీకార చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది.
Also Read: పాక్‌కు భారత్ మరో ఊహించని షాక్.. అప్పు ఇవ్వొద్దని IMFకు కంప్లైంట్!
పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఉగ్రదాడికి సంబంధించిన వీడియోను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో పాకిస్థాన్ ఉగ్రవాదులు భారత్‌లో దాడులు చేసిన దృశ్యాలను కూడా బయటపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్థాన్ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతోనే కేంద్రం.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: మనకు అణ్వాయుధాలున్నాయి..మనల్నేం చేయలేరు....మరియం నవాజ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
మరేవైపు బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశం కూడా ముగిసింది. మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర కేబినెట్ నిర్ణయాలపై ప్రెస్‌మీట్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీ నివాసంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డొభాల్, త్రివిధ దళాల అధిపతులు సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పహల్గాం దాడికి ధీటైన జవాబు ఇస్తామన్నారు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తామన్నారు. ఈ విషయంలో త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామన్నారు. దాడికి సమయం, తేదీని సైన్యమే నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. సైన్యంపై తనకు పూర్తిగా నమ్మకం ఉందని స్పష్టం చేశారు.